కోల్‌కతా రేప్ ఘటనపై సీబీఐ దర్యాప్తు వేగవంతం.. సందీప్ ఘోష్‌తో సహా ఆరుగురికి పాలిగ్రాఫ్ టెస్ట్‌లు
కోల్‌కతా రేప్ ఘటనపై సీబీఐ దర్యాప్తు ఊపందుకుంది. ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్‌తో సహా ఆరుగురికి పాలిగ్రాఫ్ టెస్ట్‌లు చేశారు. అవినీతి ఆరోపణలపై సందీప్ ఘోష్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.

కోల్‌కతా రేప్ ఘటనపై సీబీఐ దర్యాప్తు ఊపందుకుంది. ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్‌తో సహా ఆరుగురికి పాలిగ్రాఫ్ టెస్ట్‌లు చేశారు. అవినీతి ఆరోపణలపై సందీప్ ఘోష్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. అవినీతి ఆరోపణలపై సందీప్ ఘోష్‌పై కేసు నమోదు చేయాలని కోల్‌కతా హైకోర్టు ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. సందీప్ ఘోష్ హయాంలో ఆర్ జీ కర్ మెడికాల్ కాలేజీలో భారీగా ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాలతో సందీప్ ఘోష్‌తో పాటు మరో నలుగురికి సీబీఐ అధికారులు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. నిందితుడు సంజీవ్‌రాయ్‌కు ఆదివారం పాలిగ్రాఫ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఘటన జరిగిన రోజు ఆసుపత్రిలో విధి నిర్వహాణలో ఉన్న వైద్యులకు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. ఈ హత్యాచార ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆయన ఆసుపత్రి ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేశారు. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం ఆయన్ని మరో కీలక పదవిలో నియమించింది. ఈ నియామకంపై హైకోర్టు స్పందించింది. ఆయన్ని దీర్ఘ కాలిక సెలవుపై పంపాలని ఆదేశాలు జారీ చేసింది. కోల్‌కతా లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనపై ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. భారీవర్షంలో SFI కార్యకర్తల ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై వాస్తవాలు కప్పిపుచ్చేందుకు బెంగాల్ సర్కార్ ఇప్పటికి కూడా ప్రయత్నిస్తోందని SFI నేతలు విమర్శించారు. డాక్టర్‌పై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోల్‌కతాలో సైంటిస్టులు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. ఆస్పత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.