AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heavy Rains: గ్యాప్ లేకుండా దంచుడు.. కుండపోత వర్షానికి దేశవ్యాప్తంగా అతలాకుతలం

దేశమంతా వరుణుడి గర్జన కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌, తమిళనాడు, బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినిలో ఆలయాల లోకి వరద నీరు చేరింది. చత్తీస్‌గడ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో గ్యాప్ లేకుండా వరుణుడు కుమ్మరిస్తున్నాడు.

Heavy Rains: గ్యాప్ లేకుండా దంచుడు.. కుండపోత వర్షానికి దేశవ్యాప్తంగా అతలాకుతలం
Weather Update
Balaraju Goud
|

Updated on: Aug 25, 2024 | 10:51 AM

Share

దేశమంతా వరుణుడి గర్జన కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌, తమిళనాడు, బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినిలో ఆలయాల లోకి వరద నీరు చేరింది. చత్తీస్‌గడ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో గ్యాప్ లేకుండా వరుణుడు కుమ్మరిస్తున్నాడు.

దేశవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు- కర్నాటక సరిహద్దులో వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తమిళనాడు లోని దిండిగల్‌లో ఉన్న వరదమానది డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో డ్యాం లోని అన్ని గేట్లను ఎత్తడంతో అద్భుతమైన జల దృశ్యం కనువిందు చేస్తోంది. భారీ వర్షాల కారణంగా పళని జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా లోని చాలా డ్యాంలు కూడా పూర్తిగా నిండిపోయాయి. డ్యాంలు నిండడంతో ఆ ప్రాంతం లోని రైతులంతా చాలా ఆనందంగా ఉన్నారు.

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి. కోల్‌కతాలో ఎటు చూసినా వరదనీరే కన్పిస్తోంది. సబ్‌వేల లోకి కూడా వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగళాఖాతంలో అల్పపీడనం కారణంగా బెంగాల్‌ లోని చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉజ్జయినిలో భారీ వర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది. ఉజ్జయినిలో పలు కాలనీలు నీట మునిగాయి. ఆలయాల లోకి వరదనీరు ప్రవేశించడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. రామ్‌ ఘాట్‌ పూర్తిగా నీట మునిగింది. దీంతో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. షిప్రా నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో ఉజ్జయిని లోని లోతట్టు ప్రాంతల లోకి వరదనీరు ప్రవేశించింది. వందలాదిమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చత్తీస్‌గడ్‌లో భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద పోటెత్తింది.

తెలంగాణలో భారీ వర్షాలు.. హై అలర్ట్!

అటు తెలంగాణ వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తునే ఉన్నాడు.గత కొన్ని రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. తాజాగా.. రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఉత్తర పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య జార్ఖండ్‌ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. సగటు సముద్ర మట్టమునకు పైన 7.6 కి.మీ.ల వరకు ఆవర్తనం విస్తరించినట్లు తెలిపింది. దీంతో తెలంగాణ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

అటు ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ మహానగరంలో ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..