Viral: రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్‌.. అమెరికాలో భారత వైద్యుడు.!

Viral: రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్‌.. అమెరికాలో భారత వైద్యుడు.!

Anil kumar poka

|

Updated on: Aug 25, 2024 | 10:50 AM

ఒక స్వీపర్‌, ఓ టీచర్‌, ఇప్పుడు ఓ డాక్టర్‌... ఏమవుతోంది వీళ్లకి.. పసిపిల్లలను కూడా వదలని దుస్థితికి చేరుకున్నారు. తాజాగా అమెరికాలో ఓ భారతీయ వైద్యుడు పవిత్రమైన తన వృత్తిని అడ్డం పెట్టుకొని వికృత చేష్టలకు పాల్పడ్డాడు. గత కొన్నేళ్లుగా చిన్నారులు, మహిళల నగ్న చిత్రాలు, వీడియోలను రహస్యంగా రికార్డ్‌ చేశాడు. ఎట్టకేలకు భార్య ఫిర్యాదుతో అతడి అరాచకాలు వెలుగులోకి రావడంతో ఇటీవల ఆక్లాండ్‌ కౌంటీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ఒక స్వీపర్‌, ఓ టీచర్‌, ఇప్పుడు ఓ డాక్టర్‌… ఏమవుతోంది వీళ్లకి.. పసిపిల్లలను కూడా వదలని దుస్థితికి చేరుకున్నారు. తాజాగా అమెరికాలో ఓ భారతీయ వైద్యుడు పవిత్రమైన తన వృత్తిని అడ్డం పెట్టుకొని వికృత చేష్టలకు పాల్పడ్డాడు. గత కొన్నేళ్లుగా చిన్నారులు, మహిళల నగ్న చిత్రాలు, వీడియోలను రహస్యంగా రికార్డ్‌ చేశాడు. ఎట్టకేలకు భార్య ఫిర్యాదుతో అతడి అరాచకాలు వెలుగులోకి రావడంతో ఇటీవల ఆక్లాండ్‌ కౌంటీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌కు చెందిన ఒయిమెయిర్‌ ఎజాజ్‌ 2011లో వర్క్‌ వీసాపై అమెరికా వెళ్లాడు. కొన్నేళ్ల పాటు అలబామాలో నివాసమున్నాడు. ఆ తర్వాత 2018లో మిషిగాన్‌కు మకాం మార్చాడు. అక్కడ ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా అతడు లైంగిక దారుణాలకు పాల్పడ్డాడు. తాను పనిచేసే చోట ఆస్పత్రి గదులు, బాత్రూమ్‌లు, చేజింగ్‌ ఏరియా వంటి ప్రదేశాల్లో రహస్యంగా కెమెరాలు పెట్టి అనేక మంది మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలను రికార్డ్‌ చేశాడు. మహిళలు స్పృహలో లేనప్పుడు వారిపై అభ్యంతరకంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను రికార్డ్‌ చేసేవాడు. ఆస్పత్రుల్లో పేషెంట్లను కూడా లైంగికంగా వేధించేవాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అతడి భార్యకు ఈ విషయం తెలియడంతో ఆ వీడియోలను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగస్టు 8న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం అతడి ఇంటిని సోదా చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

అతని ఇంట్లో ఓ కంప్యూటర్‌, ఫోన్లు, 15 ఎక్స్‌టర్నల్‌ స్టోరేజీ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అందులో వేలాదిగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఒక సింగిల్‌ హార్డ్‌ డ్రైవ్‌లో 13వేల వీడియోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్లౌడ్ స్టోరేజ్‌లోనూ ఈ దృశ్యాలను అప్‌లోడ్‌ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతడిపై పలు కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. అతడి బాధితుల సంఖ్య చాలా ఎక్కువ ఉందని, దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసేందుకు కొన్ని నెలలు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.