Viral: మా నాన్నను జైల్లో పెట్టండి.! తండ్రిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ఐదేళ్ల బుడ్డోడు..

Viral: మా నాన్నను జైల్లో పెట్టండి.! తండ్రిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ఐదేళ్ల బుడ్డోడు..

Anil kumar poka

|

Updated on: Aug 25, 2024 | 12:06 PM

ఒకప్పుడు పిల్లలకు అన్నం పెట్టాలన్నా, వారి అల్లరి మాన్పించాలన్నా పోలీసులొస్తున్నారు.. అల్లరి చేస్తే పోలీసులకు ఇచ్చేస్తాను అని చెప్పి తల్లి భయపెట్టేది. కానీ ఇప్పుడు కాలం మారింది. పోలీసులు, పోలీస్‌ స్టేషన్‌ అంటే కూడా తెలియని చిన్నారులు తల్లిదండ్రులపై నేరుగా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదులు చేసేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియోను ఓ వ్యక్తి తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

ఒకప్పుడు పిల్లలకు అన్నం పెట్టాలన్నా, వారి అల్లరి మాన్పించాలన్నా పోలీసులొస్తున్నారు.. అల్లరి చేస్తే పోలీసులకు ఇచ్చేస్తాను అని చెప్పి తల్లి భయపెట్టేది. కానీ ఇప్పుడు కాలం మారింది. పోలీసులు, పోలీస్‌ స్టేషన్‌ అంటే కూడా తెలియని చిన్నారులు తల్లిదండ్రులపై నేరుగా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదులు చేసేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియోను ఓ వ్యక్తి తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఐదేళ్ల బుడ్డోడు తన తండ్రిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. మా నాన్న న‌న్ను నదిలో స్నానం చేసేందుకు వెళ్లకుండా ఆపుతున్నాడు. ఆయన్ని వెంటనే జైల్లో పెట్టేయండి అంటూ కంప్లైంట్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో ప్రకారం ఆ పిల్లవాడు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడి ఓ కుర్చీపై కూర్చున్నాడు. అతనికి ఎదురుగా టేబుల్‌కి అవతలి వైపున ఒక పోలీసు అధికారి కూర్చుని ఉన్నారు. పోలీసులు అతని పేరు, ఎవరిపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నావు, నేరం ఏంట‌ని ఆ బుడ్డోడిని అడిగారు. ఇక పోలీస్‌ అధికారికి సమాధానమిస్తూ, పిల్లవాడు తన పేరు చెప్పి, తనను వాళ్ల నాన్న నదికి వెళ్లనివ్వడంలేదని, వీధిలో ఆడుకోవద్దని అడ్డుప‌డుతున్నాడ‌ని చెప్పాడు. ఈ వీడియోను సురేష్ సింగ్ అనే ఎక్స్‌ ఖాతాదారు షేర్ చేశారు. అతను ఈ వీడియోకు “మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఐదేళ్ల పిల్లవాడు తన సొంత తండ్రిపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. నదిలో స్నానానికి వెళ్తున్న చిన్నారిని తండ్రి ఆపి మందలించాడు. కోపంతో ఆ పిల్లవాడు తండ్రికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నాడు” అనే క్యాప్షన్ జోడించారు. దాంతో బుడ్డోడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. నెటిజన్లు త‌మ‌దైనశైలిలో ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.