Telangana: మంత్రముగ్ధులను చేస్తున్న జలదృశ్యం.. ప్రకృతి అందాలతో మైమరిచిపోతున్న పర్యాటకులు..!
ప్రకృతి అందాలకు నెలవు ఈ జలదృశ్యం. శ్రావణమాసంలో జలపాతం దగ్గర సందడి చేస్తూ, ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేట గ్రామ సమీపంలోని పాండవలంక జలపాతం దగ్గరకు పర్యాటకులు క్యూకట్టారు. వర్షాలకు గుట్టపై నుంచి నీరు వస్తుండటం ఆకట్టుకుంటుంది. వీకెండ్‌లో పర్యాటకులు తరలివస్తున్నారు.

పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ ప్రాంతంలో కొద్ది రోజులు గడిపారట. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని నానుడి. ఏటా శ్రావణమాసం, వర్షాకాలం నేపథ్యంలో ఈ ప్రాంతంలో గుట్టపై నుండి నీరు రావడంతో ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు క్యూకడుతుంటారు. అయితే ఈ ప్రాంతానికి సరైన రోడ్డు, రవాణా మార్గం లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. మంచి రోడ్డు వేయాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..