Cupping Therapy: వేల సంవత్సరాల నాటి కప్పింగ్ థెరపీ? ఎలా చేస్తారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే?
WebMD ప్రకారం కప్పింగ్ థెరపీ అనేది ప్రత్యామ్నాయ ఔషధానికి పురాతన రూపం. ఇక్కడ చికిత్స చేసే వారు థెరపీ తీసుకుంటున్న వ్యక్తుల చర్మంపై కొన్ని నిమిషాల పాటు ప్రత్యేక కప్పులను ఉంచుతారు. దీని వలన కప్ క్రింద ఉన్న శరీరంలోని కణజాలం పైకి లాగడం, ఉబ్బడం వలన ప్రభావిత ప్రాంతానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. కప్పుల కింద రక్త ప్రసరణ మెరుగుపడటం వలన మలినాలను, విషపదార్ధాలను సమీపంలోని కణజాలం, అవయవాల నుండి ఉపరితలం వైపు తొలగించడం కోసం ఆకర్షిస్తుంది.
ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కోసం సమతుల్య ఆహారం, వ్యాయామంతో సహా తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు. వాటిలో కప్పింగ్ థెరపీ కూడా ఒకటి. కప్పింగ్ అనేది వేల సంవత్సరాలుగా అనేక వ్యాధులకు ఉపయోగించే చికిత్స. ఈ థెరపీని సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ప్రయత్నిస్తున్నారు. కప్పింగ్ థెరపీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఖాతాలలో దీనికి సంబంధించిన రకరకాల పోస్ట్‌లను షేర్ అవుతూ తెగ హల్ చల్ చేస్తున్నాయి. అయితే కొంతమందికి ఇప్పటికీ కప్పింగ్ థెరపీ అంటే ఏమిటి? ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది? అనే ప్రశ్నలు కలుగుతూనే ఉన్నాయి. కనుక ఈ రోజు కప్పింగ్ థెరపీ గురించి తెలుసుకుందాం..
కప్పింగ్ థెరపీ అంటే ఏమిటి?
WebMD ప్రకారం కప్పింగ్ థెరపీ అనేది ప్రత్యామ్నాయ ఔషధానికి పురాతన రూపం. ఇక్కడ చికిత్స చేసే వారు థెరపీ తీసుకుంటున్న వ్యక్తుల చర్మంపై కొన్ని నిమిషాల పాటు ప్రత్యేక కప్పులను ఉంచుతారు. దీని వలన కప్ క్రింద ఉన్న శరీరంలోని కణజాలం పైకి లాగడం, ఉబ్బడం వలన ప్రభావిత ప్రాంతానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. కప్పుల కింద రక్త ప్రసరణ మెరుగుపడటం వలన మలినాలను, విషపదార్ధాలను సమీపంలోని కణజాలం, అవయవాల నుండి ఉపరితలం వైపు తొలగించడం కోసం ఆకర్షిస్తుంది. నొప్పి , వాపు నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది ఈ థెరపీని తీసుకుంటున్నారు. ఈ చికిత్సలో గాజు, వెదురు, మట్టి కుండలు, సిలికాన్ లేదా ప్లాస్టిక్ కప్పులు ఉపయోగిస్తారు.
కప్పింగ్ థెరపీ ఆరోగ్య ప్రయోజనాలు
కప్పింగ్ థెరపీ చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. రక్తహీనత, హిమోఫిలియా వంటి రక్త రుగ్మతల సమస్య నివారణకు ఇది సహాయకరంగా ఉంటుంది. ఇది రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఫైబ్రో మలేషియా, మొటిమలు, తామర నుండి ఉపశమనాన్ని అందించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో పాటు వెన్నునొప్పి , శరీర నొప్పి నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. కప్పింగ్ థెరపీ మైగ్రేన్, అధిక రక్తపోటు, ఆందోళన, నిరాశ , అనారోగ్య సిరలతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ ఈ పరిస్థితులన్నింటికీ కప్పింగ్ థెరపీని ఉపయోగించవచ్చో లేదో తెలుసుకోవడానికి ఇంకా పరిశోధన జరగలేదని చెప్పారు.
2015లో జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం కప్పింగ్ థెరపీ మొటిమలు, హెర్పెస్ జోస్టర్, నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే మెరుగైన అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.
ఒక వ్యక్తి కప్పింగ్ థెరపీ చేయించుకోవాలనుకుంటే ముందుగా దాని గురించి మంచి నిపుణుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఈ థెరపీ తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్, చికాకు రావచ్చు. దీనితో పాటు, ఇది చర్మంపై గుర్తులు ఏర్పడవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)