Kitchen Hacks: ఇంట్లో చెద ఇబ్బంది పెడుతోందా.. ఈ నేచురల్ టిప్స్ తో చెదపురుగుల నుంచి ఉపశమనం పొందండి..

చెదపురుగులను నుంచి వస్తువులను రక్షించుకోవడానికి వస్తువు ఉపరితలంపై ఎంత శుభ్రం చేసినా అవి సులభంగా తగ్గవు. కనుక చెదపురుగులను వదిలించుకునేందుకు కొన్ని రకాల వస్తువులను ఉపయోగించడం చాలా ముఖ్యం. కొన్ని రకాల స్ప్రేలను ఇంట్లో దొరికే కొన్ని వస్తువుల నుండి ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఆ స్ప్రేలతో చెదపురుగులను వదిలించుకోవచ్చు.

Kitchen Hacks: ఇంట్లో చెద ఇబ్బంది పెడుతోందా.. ఈ నేచురల్ టిప్స్ తో చెదపురుగుల నుంచి ఉపశమనం పొందండి..
Termite Removal Spray
Follow us
Surya Kala

|

Updated on: Aug 25, 2024 | 10:04 AM

ప్రస్తుతం వాతావరణం తేమతో కూడి ఉంటుంది. దీంతో తడి, పొడి అనే తేడా లేకుండా చెక్కలను చెద తినేస్తుంది. ఎందుకంటే చెదపురుగులు తేమతో కూడిన వాతావరణంలో సులభంగా వృద్ధి చెందుతాయి. అందువల్ల వర్షాకాలంలో చెదపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. పుస్తకాలు, చెక్క లేదా గోడ మొదలైన వాటికి చెదపురుగులు పడితే అలా పాకి ఫర్నిచర్, తలుపు లేదా కాగితంతో చేసిన ఏ వస్తువులైనా పాడు చేస్తాయి. వాస్తవానికి చెదపురుగులు కలపలో ఉండే సెల్యులోజ్‌ను విచ్ఛిన్నం చేసి ఆహారంగా తింటాయి. దీని కారణంగా అవి క్రమంగా ఆ వస్తువును పూర్తిగా బోలుగా చేస్తాయి.

చెదపురుగులను నుంచి వస్తువులను రక్షించుకోవడానికి వస్తువు ఉపరితలంపై ఎంత శుభ్రం చేసినా అవి సులభంగా తగ్గవు. కనుక చెదపురుగులను వదిలించుకునేందుకు కొన్ని రకాల వస్తువులను ఉపయోగించడం చాలా ముఖ్యం. కొన్ని రకాల స్ప్రేలను ఇంట్లో దొరికే కొన్ని వస్తువుల నుండి ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఆ స్ప్రేలతో చెదపురుగులను వదిలించుకోవచ్చు.

వెల్లుల్లి, వేప కలిపి స్ప్రే చేసి అప్లై చేయాలి

ఇవి కూడా చదవండి

చెదపురుగులను తొలగించడానికి రెండు మూడు కప్పుల నీరు తీసుకోవాలి. వేప నూనె లేదా వేప ఆకులను వెల్లుల్లి రెమ్మలను కలిపి.. ఇప్పుడు ఈ రెండింటినీ మిక్సీలో నీళ్లలో పాటు వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీని తరువాత దానిని ఈ మిశ్రమాన్ని చక్కటి గుడ్డతో ఫిల్టర్ చేసి సీసాలో నింపండి. ఈ నీటిని రోజూ ఎక్కడ చెదపురుగులున్నాయో అక్కడ చిలకరిస్తే కొద్దిరోజుల్లోనే చెదపురుగులు తొలగిపోతాయి.

హైడ్రోజన్ పెరాక్సైడ్

చెదపురుగులను తొలగించడానికి శక్తివంతమైన స్ప్రేని సిద్ధం చేయాలనుకుంటే మూడు నుండి నాలుగు చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్‌లో ఒక చెంచా బేకింగ్ సోడాను కలపండి. ఈ ద్రావణాన్ని కొంత సమయం పాటు అలా ఉంచండి. అది సక్రియం అయిన తర్వాత చెదపురుగు ప్రభావిత ప్రాంతంపై పిచికారీ చేయండి. అయితే ఈ స్ప్రే పిల్లలకు అందుబాటులో లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి.

బోరాక్స్ పౌడర్ తో ద్రవాన్ని తయారు చేయండి

బోరాక్స్ పౌడర్‌ను చెదపురుగులను తొలగించడానికి ఉపయోగించవచ్చు. ఇది చాలా ఇళ్లలో క్లీనర్‌గా కూడా ఉపయోగించబడుతుంది. సులభంగా లభిస్తుంది. బోరాక్స్ పౌడర్ ప్రభావవంతమైన పురుగుమందుగా పనిచేస్తుంది. ఈ ద్రవాన్ని తయారు చేయడానికి మూడు కప్పుల గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో రెండు చెంచాల బోరాక్స్ పౌడర్ వేసి, మీరు ఒక చెంచా ఉప్పును కూడా జోడించండి. ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి చెదపురుగు సోకిన ప్రదేశంలో చల్లండి. వర్షాకాలంలో ఇతర కీటకాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ ద్రవానంతో ఇంటి నేలను కూడా శుభ్రం చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)