AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నోట్లకు నో చెబుదాం.. నిజాయితీగా ఓటేద్దాం.. ఆ గ్రామం యువత ఆదర్శ నిర్ణయం

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలనే సామేత మీరదందరూ వినే ఉంటారు. పల్లెలు బాగుంటే దేశంమొత్తం బాగుపడుతుందని ఆలోచన చేసిన కొందరు యువకులు వారి గ్రామంలో వినూత్న మార్పునకు నడుం కట్టారు. రానున్న స్థానిక సంస్థల్లో గ్రామంలోని ఏ ఒక్కరూ డబ్బులు తీసుకొని ఓటు వేయవద్దని ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. డబ్బులు తీసుకొని ఓటు వేస్తే జరిగే అనర్థాలను వివరిస్తున్నారు.

Telangana: నోట్లకు నో చెబుదాం.. నిజాయితీగా ఓటేద్దాం.. ఆ గ్రామం యువత ఆదర్శ నిర్ణయం
Telangana News
P Shivteja
| Edited By: Anand T|

Updated on: Oct 13, 2025 | 3:35 PM

Share

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాలలోని యువత ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌లో గ్రామ అభివృద్ధి కమిటీ,యువత సమావేశమై రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం తీసుకోకుండా రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు వినియోగించు కోవాలని నిర్ణయించారు.ఓటు హక్కు ఎంత విలువైనదో చెప్పే విధంగా గ్రామానికి చెందిన మేధావులు, గ్రామ పెద్దలు, యువత సమావేశమై ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి డబ్బు పంచకుండా, ఓటరు కూడా డబ్బు, మద్యానికి తన ఓటును అమ్ముకోకుండా తీర్మానం చేశామని గ్రామ యువకులు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు మాట్లాడుతూ..ఒక వ్యక్తి ఓటు హక్కు ఎంతో విలువైనదని,ఆ ఓటు హక్కును డబ్బుకు,మద్యానికి అమ్ముకోకుండా ఓటు వెయ్యాలనేదే తమ లక్ష్యమన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం డబ్బులు, మద్యం పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తురన్నారని..స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ గ్రామంలో డబ్బు,మద్యం తీసుకోకుండా,పంచకుండా,తీర్మానం చేశామని తెలిపారు.రాష్ట్రంలోని మిగతా గ్రామాలు కూడా ఈ విధంగా ఆలోచించాలని కోరారు.

ప్రతి గ్రామంలోని యువత ఇదే తీరుగా ఆలోచించి.. తమ గ్రామంలోని చదువుకోని తల్లిదంద్రులు, బంధువులు, తెలిసిన వారికి దీనిపై అవగాహన కల్పించాలని వారు కోరుతున్నారు. ఎలక్షన్ల సమయంలో మనం డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తేనే ఎన్నిల తర్వాత మనం ప్రజాప్రతినిధులను ప్రశ్నించగమని చెబుతున్నారు.కాబట్టి ప్రతి ఒక్కరూ డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలని కోరుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం