AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ ప్రాంతాన్ని భయపెడుతున్న పిల్లి.. లైట్ తీసుకుంటే ఖేల్ ఖతం…

కుక్కలు - కోతులే కాదు.. ఇప్పుడు పిల్లులు కూడా దాడులతో బెంబేలెత్తిస్తున్నాయి.. పిల్లులు పులుల్లా గాండ్రిస్తున్నాయి.. పిల్లి కరవడంతో ఆస్పత్రుల్లో చేరే బాధితుల సంఖ్య కలవరపెడుతోంది.. ఆ జిల్లాలో ప్రతినెల పెరిగిపోతున్న పిల్లి బాధితుల సంఖ్య తీవ్ర చర్చకు దారితీస్తుంది. అసలు పిల్లులు కరవడానికి కారణాలేంటి..! ఎలాంటివారు బాధితులుగా మారుతున్నారు..! ఇంతకీ ఈ పిల్లుల గోల ఎక్కడ..! 

Telangana: ఆ ప్రాంతాన్ని భయపెడుతున్న పిల్లి.. లైట్ తీసుకుంటే ఖేల్ ఖతం...
Cat Bite
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Sep 21, 2025 | 4:27 PM

Share

పిల్లులు పులులవుతున్నాయి.. జనంపై పడి రక్కి గాయపరుస్తున్నాయి.. కోతులు, కుక్కలకు ఏమాత్రం తీసిపోకుండా పిల్లి బారిన పడిన బాధితులు పెరిగి పోతున్నారు. ఒకవైపు వీధికుక్కల స్వైర విహారం.. వానరసేనల ఆకలి దాడులు జనం బెంబేలెత్తి పోయేలా చేస్తుంటే.. మరోవైపు పిల్లుల బెడద కలకలం సృష్టిస్తుంది.. వైద్య ఆరోగ్యశాఖ రికార్డుల ప్రకారం వరంగల్ – హనుమకొండ జిల్లాల్లో నమోదవుతున్న పిల్లి బాధితుల సంఖ్య కలవరపెడుతోంది.

ఈ రెండు జిల్లాల్లో ప్రతి నెలా 60 మందికి పైగా బాధితులు పిల్లి కరవడం, రక్కడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఇలాంటి బాధితులు వ్యాధుల బారిన పడకుండా యాంటి రేబిస్ వ్యాక్సిన్ వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. కుక్క కరిచినా, కోతి కరిచినా, పిల్లి కరిచినా కచ్చితంగా యాంటీ రెబిస్ వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో తగిన వ్యాక్సిన్ అందుబాటులో ఉంది అని చెబుతున్నారు.. పిల్లి కరిస్తే.. ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాగా ఇళ్లలో పిల్లులను పెంచుకునే వారే వాటి పెంపకం సరిగా తెలియకపోవడంతో.. దాడులు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.. పిల్లి కరవడానికి, రక్కడానికి గల కారణాలు, చికిత్సపై అవగాహన అవసరం.

అయితే ఈ మధ్య చాలామంది పిల్లులను ఇళ్లలో సాధుజంతువుగా పెంచుకోవడం ఫ్యాషన్‌గా మారింది.. ఆ పిల్లిని పెంచే విధానం తెలియకపోవడం వల్లే అవి గోర్లతో రక్కడం, కరవడం జరుగుతుందని వెటర్నరీ వైద్యులు అంటున్నారు.. అయితే పిల్లులపై నియంత్రణ లేకపోవడంతో వాటి సంతతి కూడా గణనీయంగా పెరుగుతుంది.. ఒక ఆడపిల్లి ద్వారా పుట్టిన ప్రతి పిల్లి బ్రతికి ఉంటే 4 ఏళ్ల వ్యవధిలో రెండు వేల వరకు వాటి సంతానం వృద్ధి చెందుతుంది. సాధారణంగా ఒక పిల్లి లైఫ్ టైం 12 సంవత్సరాలు ఉంటుంది… ఆడ పిల్లి.. 12 ఏళ్లలోపు చనిపోకపోతే…దాని సంతాన వృద్ధి సుమారు 60 వేల వరకు పెరిగే అవకాశం ఉందని వెటర్నరీ వైద్య నిపుణులు సూచిస్తున్నారు..

వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నారు.. కోతులను పట్టి అడవుల్లో వదిలేస్తున్నారు.. కానీ పిల్లులు వేల సంఖ్యలో పెరిగిపోతున్నా వీటి పైన నియంత్రణ లేదు.. ఈ మధ్య ప్రతి ఒక్కరు పిల్లులను పెంచుకోవడం ఫ్యాషన్ గా మారడం.. వాటిని పెంచే విధానం తెలియక పోవడం వల్లే చాలామంది పిల్లి కాటుకు గురవుతున్నారు.