AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ముసుగులో మహిళ.. అసలు మ్యాటర్ తెలిస్తే మ్యాడైపోతారు..

లోన్​ యాప్స్‌లో తెగ అప్పులు చేశాడు. తీర్చే మార్గం కనిపించలేదు. ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. ఇంతలో ఓ ఫ్రెండ్ కాల్​చేసి మాటల మధ్యలో ఊరెళ్తున్నాడని చెప్పాడు. దీంతో ఇతగాడి మనసులో ఓ పాడు ఆలోచన పుట్టింది. స్నేహితుడి ఇంటిని కొల్లగొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఆడ వేషంలో వెళ్లి పని కానిచ్చాడు. కానీ తర్వాత పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.

Hyderabad: ముసుగులో మహిళ.. అసలు మ్యాటర్ తెలిస్తే మ్యాడైపోతారు..
Man Disguised As Woman
Ram Naramaneni
|

Updated on: Sep 21, 2025 | 3:18 PM

Share

బంజారాహిల్స్‌ ఉదయ్​ నగర్‌లో నివాసం ఉండే.. శివరాజ్ అనే వ్యక్తి ఈ నెల 16న​ఫ్యామిలీతో కలిసి నిజామాబాద్​ వెళ్లాడు. అయితే ఈ విషయాన్ని శివరాజ్​ కుమారుడు తన ఫ్రెండ్‌ హర్షిత్‌కు ఫోన్ మాట్లాడుతుండగా చెప్పాడు. సీసీ కెమెరా టెక్నీషియన్ అయిన హర్షిత్​ లింగంపల్లిలో నివసిస్తున్నాడు. మరుసటి రోజు శివరాజ్​ఫ్యామిలీ తిరిగి హైదరాబాద్ వచ్చింది. చూసేసరికి ఇంటి తాళం బ్రేక్ చేసి, అల్మారాలో ఉన్న 6.75 తులాల బంగారు నగలు, రూ.1.10 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ చెక్ చేయగా.. ఒక మహిళ లోపలికి వెళ్లినట్లు, బయటకు వచ్చినట్లు ఉంది. దీంతో ఆ మహిళే దొంగ అనుకున్నారు. అయితే ముందు రోజుల సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయగా. చోరీకి ఒకరోజు ముందు ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను గమనిస్తున్న ఓ వ్యక్తి కినిపించాడు. అతను హర్షిత్ అని శివరాజ్ కుమారుడు గుర్తించాడు. దీంతో పోలీసులకు సీన్ అర్థమైంది. లింగంపల్లిలోని హర్షిత్​ఇంటిలో సోదాలు నిర్వహించి రూ.6.75 తులాల బంగారు ఆభరణాలు, రూ.85 వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు హర్షిత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నంచగా.. ఆడ వేషంలో వచ్చి చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించాడు. ఆ డబ్బులో రూ.25 వేలు అప్పు తీర్చడానికి వినియోగించినట్లు తెలిపాడు. లోన్​యాప్‌లో అప్పలు చేసి.. ఎలా తీర్చాలో తెలియక దొంగతనం చేసినట్లు పోలీసులకు చెప్పాడు. తన స్నేహితుడు ఊరు వెళ్తున్నాం అని చెప్పగానే చోరీ చేయాలన్న ఆలోచన వచ్చినట్లు పోలీసులు ముందు నిజం ఒప్పుకున్నాడు. నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు