Brahma Kamalam: ఒకేసారి వికశించిన 26 బ్రహ్మ కమలాలు.. ఈ పువ్వులు పూచిన ఇంట్లో సమస్యలు తొలగిపోతాయని నమ్మకం..
బ్రహ్మ కమలం ఒక దైవిక పుష్పం. ఇది చాలా అరుదైన పుష్పం.. రాత్రిపూట వికసించి ఉదయానికి వాడిపోయే ప్రత్యేకత దీనికి ఉంది. బ్రహ్మ కమలం మతపరమైన ప్రాముఖ్యం, పౌరాణిక నేపథ్యం ఉంది. ఈ అరుదైన పుష్పం హైదరాబాద్ లోని సైదాబాద్ కాలనీలో ఒక ఇంట్లో ఒకేసారి గుత్తులు గుత్తులుగా వికశించి చూపరులను ఆకట్టుకుంది.
ప్రకృతిలో రకరకాల పువ్వులున్నాయి. అటువంటి పువ్వుల్లో ఒకటి బ్రహ్మ కమలం. ఈ పువ్వులకు హిందూ మతంలో పువ్వులకు విశిష్ట స్థానం ఉంది. హిమాలయాల్లో కనిపించే ఈ అరుదైన మొక్కను ఇప్పుడు ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు. మొగ్గ తొడిగిన తర్వాత రెండు, మూడు వారాలకు ఈ బ్రహ్మ కమలం వికశిస్తుంది. అయితే ఈ అరుదైన పుష్పం రాత్రి సమయంలో మాత్రమే వికశిస్తాయి. ఉదయం వాడిపోతాయి. అయితే బ్రహ్మ కమలాలు వికశించినప్పుడు వచ్చే పరిమళం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మతపరమైన ప్రాముఖ్యం, పౌరాణిక నేపథ్యం ఉన్న ఈ బ్రహ్మ కమలం ఒకేసారి పదుల సంఖ్యలో వికశించి చూపరులను ఆకట్టుకున్నాయి.
హైదరాబాద్ మహానగరంలోని సైదాబాద్ కాలనీకి చెందిన అలిగ విద్యానంద్-చందన దంపతుల ఇంట్లో బ్రహ్మకమలం పుష్పం వికసించింది. ఒకేసారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 పుష్పాలు విరబూసాయి. గతంలో ఇదే మొక్కకు 31 పుష్పాలు వికశించాయి. అయితే రాత్రి సమయంలో పూసే ఈ పువ్వులు సూర్యోదయానికి ముందే వాడిపోతాయి.
బ్రహ్మ కమలం వికసించే ప్రదేశం పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకనే చాలామంది ఇళ్లలో బ్రహ్మ కమలం మొక్కను పెంచుతారు. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండటంతో పాటు ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు బ్రహ్మ కమలం వికసించిన ఇంట్లో అప్పటి వరకూ ఉన్న సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..