Winter Hair Care Tips: శీతాకాలంలో చుండ్రు నుంచి ఉపశమనం కోసం కలబందలో వీటిని కలిపి అప్లై చేయండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం..

శీతాకాలంలో తలలో చుండు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తేమ లేకపోవడం వల్ల, జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. జుట్టులో తేమను నిర్వహించడానికి , చుండ్రును నియంత్రించడానికి ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా కలబందలో ఈ వస్తువులను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వలన బెస్ట్ రిజల్ట్ వస్తుంది.

Winter Hair Care Tips: శీతాకాలంలో చుండ్రు నుంచి ఉపశమనం కోసం కలబందలో వీటిని కలిపి అప్లై చేయండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం..
Winter Hair Care Tips
Follow us
Surya Kala

|

Updated on: Nov 22, 2024 | 6:32 PM

చలికాలంలో దాహం లేదంటూ తక్కువగా నీరు తాగుతారు. దీంతో శరీరం డీ హైడ్రేషన్ బారిన పడుతుంది. అంతేకాదు జుట్టు, చర్మంలో తేమ లోపం ఉంటుంది. దీంతో జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. జుట్టుకు సంబంధించిన ఈ సమస్యను నియంత్రించకపోతే.. జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతే కాదు తలలో చుండ్రు కూడా పేరుకుపోతుంది. చలికాలంలో చాలా మంది తక్కువగా స్నానం చేస్తారు లేదా వారంలో తక్కువ రోజులు జుట్టుని శుభ్రం చేసుకుంటారు. తలలో మురికి పేరుకుని.. తేమ లేకపోవడం అనేక జుట్టు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కనుక చలికాలంలో కూడా నీరు ఎక్కువగా తాగాలి. అదే సమయంలో హోం రెమెడీస్ ని పాటించడం ద్వారా జుట్టును హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు.

జుట్టులో తేమ లోపాన్ని తొలగించడంలో కలబంద మంచి ఎంపిక. మాయిశ్చరైజింగ్ గా మాత్రమే కాదు దీనిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్నాయి కనుక జుట్టు ఇన్ఫెక్షన్లను కూడా నయం చేస్తుంది. శీతాకాలంలో జుట్టు ఆరోగ్యంగా.. మెరిసేలా ఉండడం కోసం కలబందలో కొన్ని రకాల పదార్ధాలను జోడించి అప్లై చేయవచ్చు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

చలికాలంలో కలబందతో జుట్టును జాగ్రత్తగా చూసుకోండి.

చుండ్రు నుంచి విముక్తి కోసం.. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి.. నేరుగా కలబంద జెల్‌ను అప్లై చేయవచ్చు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తలపై వచ్చే ఇన్ఫెక్షన్లు లేదా మొటిమలను కూడా తగ్గిస్తాయి. స్నానం చేయడానికి ముందు ఒక గిన్నెలో అలోవెరా జెల్ తీసుకోండి. దీన్ని నేరుగా తలకు పట్టించి, కాసేపు అలాగే ఉంచాలి. మీరు దీన్ని తొలగించడానికి మూలికా స్నానం కూడా చేయవచ్చు. ఇలా చేయడం వలన రెట్టింపు ప్రయోజనాలను ఇస్తుంది. వేప ఆకులను స్నానపు నీటిలో కలిపి స్నానం చేసినా మంచి రిజల్ట్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

అలోవెరా.. నిమ్మకాయ

జుట్టు నల్లగా.. ఒత్తుగా మారడానికి కలబంద, నిమ్మకాయ మిశ్రమాన్ని ప్రయత్నించండి. దీని కోసం రెండు నుంచి మూడు చెంచాల అలోవెరా జెల్ తీసుకొని దానికి ఒక చెంచా నిమ్మరసం కలపండి. ఈ పేస్ట్‌ని తలకు బాగా పట్టించి .. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. జుట్టు నుంచి కలబంద, నిమ్మ మిశ్రమాన్ని తొలగించడానికి తేలికపాటి షాంపూని మాత్రమే ఉపయోగించండి. దీని తరువాత ఖచ్చితంగా జుట్టు తేమగా ఉంచడం కోసం కండీషనర్ ఉపయోగించండి.

అలోవెరా.. వెనిగర్

వెనిగర్ యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. జుట్టుకు కలబందతో వెనిగర్ ను కలిపి ఉపయోగిస్తే.. రెట్టింపు ప్రయోజనాలను పొందుతారు. కలబంద, వెనిగర్ ల మిశ్రమం చుండ్రును తొలగిస్తుంది. ఒక గిన్నెలో అలోవెరా జెల్‌లో అర చెంచా వెనిగర్ మిక్స్ చేసి అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టుని వాష్ చేయండి. హెయిర్ వాష్ తర్వాత కండీషనర్ ఉపయోగించడం కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి.

టీ ట్రీ ఆయిల్.. అలోవెరా

చుండ్రుని తగ్గించడానికి లేదా తొలగించడానికి అలోవెరా జెల్, టీ ట్రీ ఆయిల్ మిశ్రమాన్ని ట్రై చేయండి. ఈ రెండూ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ మిశ్రమం అప్లై చేయడం వలన తలలో ఫంగస్ లేదా చుండ్రు తగ్గడం ప్రారంభమవుతుంది. మూడు చెంచాల అలోవెరా జెల్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని.. దానికి కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను కలపండి. గంట తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు నుంచి వచ్చే వాసన, దురద కూడా తగ్గుతుంది.

అలోవెరా.. పెరుగు

జుట్టును శుభ్రం చేయడానికి లేదా చుండ్రును తొలగించడానికి కలబందతో కలిపిన పెరుగును అప్లై చేయవచ్చు. కలబందలో రెండు చెంచాల పెరుగు, నిమ్మరసం కూడా కలపండి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా.. మెరుస్తూ ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)