AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహారాన్ని నమలకుండా డైరెక్టుగా మింగుతున్నారా..? వామ్మో, పెను ప్రమాదంలో పడుతున్నట్టే..

ఆహారాన్ని సరిగ్గా నమిలి తినకపోతే దీర్ఘకాంలో చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని.. అలాంటి పొరపాటు చేయవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ ప్రక్రియ మన నోటి నుంచి ప్రారంభమవుతుంది. మనం ఆహారాన్ని సరిగ్గా నమిలినప్పుడు, అది చిన్న ముక్కలుగా విరిగిపోతుంది.. ఇది కడుపులోని ప్రేగులకు చేరి సులభంగా జీర్ణమవుతుంది. లేకపోతే కష్టంగా జీర్ణక్రియ ప్రక్రియ జరుగుతుంది.

ఆహారాన్ని నమలకుండా డైరెక్టుగా మింగుతున్నారా..? వామ్మో, పెను ప్రమాదంలో పడుతున్నట్టే..
Food Eating
Shaik Madar Saheb
|

Updated on: Nov 23, 2024 | 2:41 PM

Share

నేటి బిజీ లైఫ్‌లో మనలో చాలా మంది ఆహారం త్వర త్వరగా తింటారు.. దాని వల్ల ఆహారాన్ని సరిగ్గా నమలడం (నిమిలి తినే) అలవాటును కోల్పోతాము. ఈ అలవాటు సామాన్యమైనదిగా అనిపించవచ్చు.. కానీ ఇది మన జీర్ణక్రియ.. మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆహారాన్ని సరిగ్గా నమలడం కేవలం చిన్న ముక్కలుగా విడగొట్టడానికే పరిమితం కాదు.. ఇది మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ముఖ్యమైనదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియ ప్రక్రియ మన నోటి నుంచి ప్రారంభమవుతుంది. మనం ఆహారాన్ని నమిలినప్పుడు, అది చిన్న ముక్కలుగా మారిపోతుంది.. ఇది కడుపు, ప్రేగులకు సులభంగా చేరి జీర్ణమవుతుంది. అదనంగా, మన లాలాజలంలో ఉండే ఎంజైమ్‌లు ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్‌లను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తాయి. అయితే.. ఆహారాన్ని సరైన విధంగా నమిలి తినకపోతే.. అది పెను ప్రమాదంగా మారుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

సరైన విధంగా ఆహారాన్ని నమిలి తినకపోతే.. ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకోండి..

గ్యాస్ – కడుపు ఉబ్బరం: పెద్ద ఆహార కణాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.. ఇది ప్రేగులలో గ్యాస్, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

గుండెల్లో మంట: ఆహారాన్ని సరిగ్గా నమలకపోతే, కడుపు ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొంటుంది.. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌కు దారితీస్తుంది.

బరువు – సంతృప్తిపై ప్రభావం: త్వరగా తినడం ద్వారా, మన మెదడు ఆకలి, సంతృప్తికి సంబంధించిన సరైన సంకేతాలను ఇవ్వదు. నెమ్మదిగా, పూర్తిగా నమలడం వల్ల సంతృప్తికరమైన హార్మోన్లను సక్రియం చేస్తుంది.. ఇది ఆకలిని తగ్గిస్తుంది.. అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. ఈ అలవాటు బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.

మొత్తం ఆరోగ్యంపై ప్రభావం:

2023లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. నమలడం అనేది జీర్ణక్రియకు మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా సంబంధించినదని పేర్కొంది.. ఇది శరీర మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.

పోషకాల శోషణ: ఆహారాన్ని సరిగ్గా నమలకపోతే, శరీరం ఆహారం నుంచి అన్ని పోషకాలను పొందదు.

నోటి ఆరోగ్యం: సరిగ్గా నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది దంతాలు, చిగుళ్లను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

బాగా నమలడానికి సులభమైన మార్గాలు:

ప్రతి ఆహారాన్ని మనం తింటున్నప్పుడు.. నోటిలో ఉంచగానే 25 నుంచి 40 సార్లు నమలడం అలవాటు చేసుకోండి. అంటే పదార్థాన్ని బట్టి అలవాటు చేసుకోవడం మంచిది. సులభమైన ఆహారం అయితే.. తక్కువ సమయంలోనే నమలవచ్చు.. అదే.. మంసాహారం అయితే.. చాలా సేపు నమిలి తినడం మంచిది..

ఎక్కువగా కాకుండా.. చిన్న చిన్న పరిణామంలో ఆహారాన్ని తినండి.. భోజనం – భోజనానికి మధ్య విశ్రాంతి తీసుకోండి.

నీరు త్రాగడం అలవాటు చేసుకోండి.. కానీ, పెద్ద పెద్ద పదార్థాలను నోటిలోనుంచి త్వరగా మింగడానికి ఉపయోగించవద్దు.

నిదానంగా – సరిగ్గా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా దీర్ఘకాలంలో మెరుగైన ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?