Chanakya Niti: ఈ 3 రకాల వ్యక్తులకు సాయం చేయడం పాముకు పాలు పొయ్యడమే అంటున్న చాణక్య

ఆచార్య చాణక్యుడు వ్యక్తిగత జీవితం నుంచి వైవాహిక జీవితం, వృత్తి, ఆరోగ్యం, ఉపాధి వరకు అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అయితే నీతిశాస్త్రంలో ఇతరులకు సహాయం చేయడం గురించి కూడా చెప్పాడు. కొన్నిసార్లు మీరు అందించే సహాయం ఇతరులకు ప్రయోజనం కలిగించదని, మీ జీవితానికి కూడా హాని కలిగిస్తుందని చాణుక్యుడు చెప్పాడు.

Chanakya Niti: ఈ 3 రకాల వ్యక్తులకు సాయం చేయడం పాముకు పాలు పొయ్యడమే అంటున్న చాణక్య
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Nov 22, 2024 | 3:30 PM

ఎవరికైనా సహాయం చేయడం పవిత్రమైన చర్యగా పరిగణించబడుతుంది. ఇతరులకు సహాయం చేసే వ్యక్తిని ఆదర్శవంతమైన వ్యక్తిత్వానికి సంకేతంగా భావిస్తారు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితిల్లో ఎవరైనా తమకు సహాయం చేయాలని కోరుకుంటారు. ముఖ్యంగా పనులు సరిగ్గా జరగకపోతే.. నిస్సహాయతను అర్థం చేసుకుని ఎదుటివారు సహాయం చేయాలనీ కోరుకుంటారు. అలా కొన్నిసార్లు మీ చేసే సహాయం అవతలి వ్యక్తికి ప్రయోజనం కలిగించదు. పైగా అది మీకు హానికరంగా మారవచ్చు. ఇదే విషయాన్నీ ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఈ మూడు రకాల వ్యక్తులకు సహాయం చేయడం హానికరం అని పేర్కొన్నాడు.

ఇతరులను తరచుగా బాధపెట్టే వారికి.. ఇతరులతో అగౌరవంగా ప్రవర్తించే వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇటువంటి వ్యక్తులతో సహవాసం చేయడం వలన మనస్సులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఆత్మవిశ్వాసం కూడా బలహీనపడుతుంది. చాణక్యుడు ప్రకారం సభ్యత లేని వ్యక్తుల సహవాసం చేసిన వ్యక్తి జీవితం నాశనం అవుతుంది. అలాంటి వారికి దూరంగా ఉండటం ద్వారానే జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు.

సంస్కారహీనమైన స్త్రీలకు దూరంగా ఉండండి

మంచి స్వభావం లేని స్త్రీని వివాహం చేసుకోవడం వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుందని చాణక్యుడు చెప్పాడు. కనుక అటువంటి స్త్రీని ఎప్పుడూ పెళ్లి చేసుకోకండి. దుర్భాషలాడుతూ మంచి వ్యక్తిత్వం లేని స్త్రీలు.. భర్తని అతని కుటుంబ పురోభివృద్ధికి ఆటంకంగా మారాతారు. అందుకే జీవిత భాగస్వామిని తెలివిగా ఎన్నుకోవాలని సూచించారు. జీవితంలో ఇలాంటి మహిళలకు దూరంగా ఉండటమే మంచిదని చాణక్యుడు చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మూర్ఖుడైన శిష్యుడు

ఆచార్య చాణక్యుడు ప్రకారం అజ్ఞానంతో ఉన్న శిష్యుడు ఏ పాఠాన్ని అర్థం చేసుకోడు. తెలివి తక్కువ విద్యార్థి కోసం గురువు తన సమయాన్ని, శక్తిని వృధా చేసుకోవడంలో అర్థం లేదు. ఇతరులు చెప్పే వాటి పట్టించుకోకుండా మూర్ఖంగా వాదించే వారి గురించి చింతించకండి. ఎందుకంటే అలాంటి వారి కోసం సమయం వృధా చేయడం పనికిరాదు. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండాలని చాణక్యుడు సూచించాడు.

వ్యాధి బారిన పడిన వ్యక్తి

అనారోగ్య వ్యక్తి ప్రతికూల శక్తిని విడుదల చేస్తాడు. అంతేకాదు అతను ఎప్పుడూ విచారంగా ఉంటాడు. దీంతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో పరిచయం, స్నేహం మిమ్మల్ని ముందుకు వెళ్లనివ్వదు. అందువల్ల ఆచార్య చాణక్యుడు అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల నుంచి దూరం పాటించాలని చెప్పాడు. కనుక తీవ్ర అనారోగ్యంతో బాధపడే వ్యక్తుల నుంచి దూరం ఉండండి.

ఈ ముగ్గురు వ్యక్తులే కాదు.. ఇతర రకాల నిర్దిష్ట గుణాలు కలిగిన వ్యక్తులకు.. అంటే మొరటుగా, హానికరంగా, అసూయగా, ద్వేషపూరితంగా, పిరికితనంతో, భయంతో ఉన్నవారు, వారికి దూరంగా ఉండటం మంచిది. జీవితంలో ముందుకు సాగాలంటే అబద్ధాలు, మద్యం సేవించడం, స్వార్థపరులు, దురాశపరులకు ఎప్పుడూ దూరంగా ఉండాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.