AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు కోట్ల మందిని ఆకర్షించిన వీడియో.. ఈ ఛాలెంజ్‌లో ఓడుతున్న భర్తలు.. మహిళలు మాత్రమే చేయగలరేమో..

ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో మహిళలు తమ భర్తలకు బ్యాలెన్స్ చేసే ఛాలెంజ్ ను విసిశారు. దీంతో భార్యాభర్తలు పోటీ పడ్డారు, ఈ చాలెంజ్ లో భార్యలు చాలా సులభంగా బ్యాలెన్స్ చేయగా.. భర్తలు దీన్ని చేసేటప్పుడు కింద పడ్డారు. ఇప్పటి వరకూ ఈ వీడియోకు 2.5 కోట్ల వ్యూస్ రాగా.. లక్ష మందికి పైగా లైక్ చేశారు.

రెండు కోట్ల మందిని ఆకర్షించిన వీడియో.. ఈ ఛాలెంజ్‌లో ఓడుతున్న భర్తలు.. మహిళలు మాత్రమే చేయగలరేమో..
Viral NewsImage Credit source: social media
Surya Kala
|

Updated on: Nov 22, 2024 | 4:55 PM

Share

మహిళలు మాత్రమే కొన్ని పనులు చేయగలరు.. అంటూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన వీడియో ఇందులో స్త్రీలు తమ భర్తలకు ఛాలెంజ్ చేయగా మగవాళ్ళందరూ ఓడి పోవడం ఈ వీడియో లో కనిపిస్తుంది. అయితే ఛాలెంజ్ ని మహిళలు చాలా సులభంగా కంప్లీట్ చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే ఈ వీడియోకి రెండున్నర మిలియన్ల వ్యూస్ వచ్చాయి అంటే నెటిజన్లు దీన్ని ఎంతగా లైక్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. మగవాళ్ళందరూ ఘోరంగా విఫలమైన సవాలు ఏమిటో చూద్దాం.

చాలెంజ్‌లో చాలా మంది మహిళలు తమ భర్తలను మోసం చేశారని వీడియో చూసిన చాలా మంది అభిప్రాయపడ్డారు. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే.. పురుషులందరి తొడ ఎముక నేల నుంచి 90 డిగ్రీల కోణంలో ఉంది. అయితే ఎవరైనా వీడియోను నిశితంగా పరిశీలిస్తే మహిళలు మోకాళ్లపై నేల మద్దతుతో కూర్చున్నట్లు తెలుస్తుంది. అయితే భర్తలను తమ ఛాలెంజ్ లో మోసం చేసి భార్యలు గెలిచారు. ఇది పూర్తిగా మోసం అని అంటున్నారు కొందరు.

ఇవి కూడా చదవండి

అయితే పురుషులు, మహిళలు ఇద్దరూ సమాన కోణంలో కూర్చున్నారు. అయితే స్త్రీలు మాత్రమే బ్యాలెన్స్ చేస్తున్నారు. పురుషులు బ్యాలెన్స్ కోల్పోతున్నారు. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలియదు.. కానీ ఈ వీడియో చూశాక బహుశా ఈ ఛాలెంజ్ కేవలం ఆడవాళ్ళ కోసం మాత్రమే చేసిందేమో అనిపిస్తుంది.

ఇక్కడ వీడియో చూడండి, మహిళలు మాత్రమే దీన్ని చేయగలరు!

ఒకరు ఈ సవాలు కష్టం కాదు.. అయితే పురుషుల తప్పు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. మోకాళ్లపై బరువు పెట్టినట్లయితే సవాలు ఒక్క క్షణంలో పూర్తయ్యేదని మరొకరు చెప్పారు. పురుషులు, మహిళలు కూర్చునే విధానాన్ని శ్రద్దగా గమనించండి.. స్త్రీలు మోసం చేస్తున్నారని మరొకరు పేర్కొన్నారు. ఇది ఖచ్చితంగా సరైనది.. నూ నా భార్యతో చేసి నెల మీద పడ్డానని ఒకరు చెప్పారు. ఇది ఓ అద్భుతం.. అయితే దయచేసి దీని చీట్ చేసే కోడ్‌ని తనకు చెప్పమని ఒకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..