స్కూల్ బ్యాగ్ లో వింత శబ్దాలు !! తెరిచి చూసినవారి గుండె గుభేల్
పాము కలలోకి వస్తేనే ఉలిక్కిపడి నిద్ర లేస్తాం. నిజంగా కంటికి కనిపిస్తే భయంతో పరుగులు పెడతాం. ఇక ఇంట్లోకే వస్తే కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. వెంటనే పరుగు పరుగున బయటకు పరిగెడతాం. ఇప్పుడు మీకు చెప్పబోయేది అలాంటి పాము సంఘటన గురించే. ఏలూరు జిల్లాలో స్కూల్‌కి వెళుతున్న ఓ పాప బ్యాగ్ లోకి పాము దూరింది.
అసలే శనివారం.. వీకెండ్. ఈ ఒక్క రోజు స్కూల్ కి వెళితే ఆదివారం సెలవు అనుకుంటూ హుషారుగా పుస్తకాల సంచి వేసుకొని బడి వైపు నడుస్తున్న ఆ పాపకు.. సడన్‌గా తన స్కూల్ బ్యాగ్ నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ఏదో కదులుతున్నట్లు అనిపించి అలాగే నిలబడింది. ఆమె పక్కన నడుస్తున్న వారికీ ఆ బ్యాగు నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. తన పక్కనున్న స్నేహితురాళ్లు గట్టిగా అరవడంతో స్కూల్ బ్యాగును విసిరికొట్టింది ఆ అమ్మాయి. ఊపిరి బిగబట్టి పిల్లలు ఆ సంచిలోకి తొంగిచూశారు. అందులో ఉన్న పామును చూసి బిగ్గరగా కేకలు వేశారు. ఓ విద్యార్థిని స్కూల్ బ్యాగ్ లోనే ఏకంగా పాము ప్రత్యక్షమవడంతో ఆ విద్యార్థితో పాటు ఆమె స్నేహితురాళ్లు కూడా భయంతో పరుగులు తీశారు. ఇంతకీ ఆ పాము ఆ బ్యాగులోకి ఎలా దూరింది? ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వాడపల్లికి చెందిన వరలక్ష్మి అనే విద్యార్థిని కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. అయితే ఎప్పటిలాగానే స్కూల్ బ్యాగ్ ను తన భుజాన వేసుకుని.. ఫ్రెండ్స్ తో కలిసి స్కూల్ కు బయలుదేరింది. స్కూలుకు వెళ్లే దారిలో బ్యాగులో ఏదో కదులుతున్నట్లుగా వరలక్ష్మికి అనిపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొంతు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. కడుపొచ్చిందన్నారు !!
మెకానిక్ రాఖీ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే.. ఈ వీడియో చూడాలి కదా..
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

