గొంతు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. కడుపొచ్చిందన్నారు !!

గొంతు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. కడుపొచ్చిందన్నారు !!

Phani CH

|

Updated on: Nov 22, 2024 | 7:47 PM

నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ 20 ఏళ్ల యువతి గొంతు నొప్పిగా ఉండడంతో చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్లింది. సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ఎక్స్-రే తీయించుకొని రావాలని వైద్యులు సూచించారు. అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కూడా చేయించుకోమని చెప్పారు. దాంతో టెస్ట్ చేయించుకున్న యువతికి షాకింగ్‌ విషయం తెలిసింది. ఆమె గర్భవతి అని నిర్ధారణ అయింది.

హ్యూమన్ హెచ్‌సీజీ స్థాయులను బట్టి ఆమె గర్భంలో ఏకంగా నాలుగు పిండాలు ఏర్పడ్డాయని వైద్యులు నిర్ధారించారు. అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన 20 ఏళ్ల కాటెలిన్ యేట్స్ అనే యువతికి ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. యేట్స్ ఈ ఏడాది ఏప్రిల్ 1న హాస్పిటల్‌కు వెళ్లింది. దీంతో ‘ఏప్రిల్ ఫూల్’ సందర్భంగా వైద్యులు ఆట పట్టిస్తున్నారేమోనని ఆమె అనుకుంది. మొదట నమ్మలేదు. కానీ ఆ తర్వాత వాస్తవాన్ని అర్థం చేసుకుంది. ఇక ఆమెకు కాబోయే భర్త జూలియన్ బ్యూకర్ ఈ వార్త విని చాలా సంతోషించాడు. కాబోయే వాడి నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో ఆమె కూడా సంతోషించింది. కాగా గర్భం పెరుగుదల సమయంలో యేట్స్ పలు సమస్యలు ఎదుర్కొంది. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంది. గర్భం 20 వారాలు దాటిన తర్వాత ఆమె హైబీపీ లాంటి పరిస్థితిని ఎదుర్కొంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెకానిక్ రాఖీ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే.. ఈ వీడియో చూడాలి కదా..