AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Pollution: కాలుష్యంతో పెరుగుతున్న గుండెపోటు , బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల సంఖ్య.. లక్షణాలు, నివారణ చర్యలు ఏమిటంటే

దేశంలోని కొన్ని ప్రాంతాలలో వాయు కాలుష్యం మునుపటితో పోలిస్తే తగ్గింది. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో AQI 300 కంటే ఎక్కువ మిగిలి ఉంది. ఈ కాలుష్యం ఆరోగ్యానికి ప్రమాదకరం. AQIతో పాటు PM 2.5 స్థాయి కూడా పెరిగింది. ఇది గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ రెండింటికి కారణం కావచ్చు. ఈ విషయంపై నిపుణుల చెప్పిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం..

Air Pollution: కాలుష్యంతో పెరుగుతున్న గుండెపోటు , బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల సంఖ్య.. లక్షణాలు, నివారణ చర్యలు ఏమిటంటే
Air Pollution
Surya Kala
|

Updated on: Nov 22, 2024 | 7:37 PM

Share

దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక పరిసర ప్రాంతాలలో కాలుష్య స్థాయి మునుపటితో పోలిస్తే తగ్గింది. అయితే ఇది ఇప్పటికీ WHO నిర్దేశించిన ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికీ ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని అనేక ప్రాంతాల్లో AQI 300 కంటే ఎక్కువగా ఉంది. PM 2.5 స్థాయి కూడా 200 కంటే ఎక్కువగా ఉంది. ఈ పెరిగిన కాలుష్యం అనేక వ్యాధులకు కారకంగా మారుతుంది. ముఖ్యంగా గుండెపోటు , బ్రెయిన్ స్ట్రోక్ రెండింటికి కారణమవుతుంది. ఈ రెండు ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం వృద్ధులలో ఎక్కువగా ఉంది. కాలుష్యం గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు ఎలా కారణమవుతుంది? వీటి ప్రారంభ లక్షణాలు ఏమిటి? నివారణ ఎలా చేయవచ్చు? నిపుణుల సలహా ఏమిటో తెలుసుకోండి.

యూరోపియన్ హార్ట్ జర్నల్ ప్రకారం AQI 300 కంటే ఎక్కువ, PM 2.5 స్థాయి 200 కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం 24% పెరుగుతుంది. నైట్రోజన్ డయాక్సైడ్ (NO2), PM 2.5 కణాలు శరీరంలోకి ప్రవేశించి బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమవుతాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం వాయు కాలుష్యం కారణంగా గుండెపోటు ప్రమాదం 25% పెరుగుతుంది. 50 ఏళ్లు పైబడిన వారు కాలుష్యం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణంలో మార్పు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ రెండింటి ప్రమాదాన్ని పెంచుతుంది.

కాలుష్యం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు ఎలా వస్తాయంటే

మెడిసిన్ డాక్టర్ సుభాష్ గిరి ఈ విషయంపై మాట్లాడుతూ కలుషితమైన గాలిలో పార్టిక్యులేట్ మ్యాటర్ (PM 2.5), నైట్రోజన్ డయాక్సైడ్ (NO2), ఓజోన్ (O3) మూడు ఉన్నాయి. ఇవి శ్వాస తీసుకునే సమయంలో ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. ముందుగా అవి ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పుడు అవి నెమ్మదిగా రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఈ చిన్న కణాలు సిరల్లో చేరడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా అవయవాల రక్త ప్రసరణలో ఇబ్బంది ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

మెదడులోని సిరల్లో రక్తం సరిగ్గా ప్రవహించదు. అప్పుడు మెదడుకు హాని కలుగుతుంది. ఈ కాలుష్య కణాలు మెదడులోని నరాల్లో కూడా పేరుకుపోతాయి. దీని వల్ల మెదడుకు రక్త సరఫరా సరిగా జరగక బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. అదేవిధంగా కాలుష్యంలో ఉండే చిన్న చిన్న కణాలు గుండెలోని సిరల్లోకి చేరినప్పుడు గుండెకు రక్త సరఫరా సరిగా జరగదు. దీంతో గుండెపై ఒత్తిడి పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఏమిటంటే

  1. ముఖ కండరాలు బలహీనంగా మారవచ్చు. దీని కారణంగా నోటికి ఒక వైపుకి వెళ్తుంది.
  2. పదాలను సరిగ్గా చెప్పడంలో ఇబ్బంది.. మాట్లాడడంలో ఇబ్బంది ఉండవచ్చు
  3. అస్పష్టమైన దృష్టి.. చూడటంలో సమస్య కలగవచ్చు.
  4. తలనొప్పి రావచ్చు. ఒకొక్కసారి చాలా తీవ్రంగా తలనొప్పి రావొచ్చు.
  5. తల తిరగడం, వాంతులు అవుతున్నాయి

గుండెపోటు లక్షణాలు

  1. తీవ్రమైన ఛాతీ నొప్పి
  2. ఛాతీ భారం
  3. శ్వాసకోశ బాధ
  4. ఎడమ చేయి , ఎడమ భుజంలో నొప్పి

కాలుష్యం నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే

  1. అనవసరంగా బయటకు వెళ్లవద్దు
  2. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే మాస్క్ ధరించండి
  3. అనారోగ్య సమస్య ఉంటే మందులను సమయానికి తీసుకోండి
  4. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించండి
  5. తినే ఆహారం పట్ల శ్రద్ధ వహించండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..