AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో మీ గుండె జర భద్రం.. లేకపోతే ప్రాణాలు తీస్తుంది.. గుండెపోటు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. చలికాలంలో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. ఈ సీజన్‌లో గుండెపోటు కేసులు ఎక్కువ. అటువంటి పరిస్థితిలో రక్షణ అవసరం... మంచి ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా గుండె సమస్యలను దూరం చేసుకోవచ్చు.. శీతాకాలంలో గుండెపోటు ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా నిరోధించవచ్చు? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి..

చలికాలంలో మీ గుండె జర భద్రం.. లేకపోతే ప్రాణాలు తీస్తుంది.. గుండెపోటు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
Heart AttackImage Credit source: Getty Images
Shaik Madar Saheb
|

Updated on: Nov 22, 2024 | 5:10 PM

Share

శీతాకాలం ప్రారంభమైంది.. వాతావరణం మారడంతోపాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. దేశంలోని చాలా ప్రాంతాల్లో చలి విజృంభిస్తోంది.. ఎముకలు కొరికే చలితో జనం ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ఉష్ణోగ్రత తగ్గడం ప్రారంభమైనప్పుడల్లా అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.. కానీ అతి పెద్ద ప్రమాదం ఏంటంటే గుండె జబ్బులు.. చలికాలంలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం.. శీతాకాలంలో గుండెపోటు కేసులు 30 శాతం పెరుగుతాయి. భారతదేశంలో కూడా ప్రతి సంవత్సరం శీతాకాలంలో గుండెపోటు కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. చలికాలంలో దేశంలో గుండెపోటు కేసులు 25 శాతం పెరుగుతాయని ఢిల్లీలోని AIIMS పరిశోధనలో తేలింది.

ఇంతకుముందు వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించేది.. ఇప్పుడు చిన్న వయసులో కూడా గుండెపోటుకు గురవుతున్నారు. చిన్నారుల నుంచి యువత, వృద్ధులు ఇలా అందరూ గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఈ సీజన్‌లో గుండెపోటు కేసులు పెరగడానికి ఉష్ణోగ్రతలు పడిపోవడం.. చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

అయితే.. చలికాలంలో గుండెజబ్బులు ఎందుకు పెరుగుతాయి..? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి..? దీన్ని ఎలా నిరోధించవచ్చు.. ఈ విషయమై రాజీవ్ గాంధీ ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అజిత్ జైన్ మాట్లాడుతూ.. చలికాలంలో చలిగాలుల కారణంగా గుండెలోని సిరలకు రక్త సరఫరా సరిగా జరగదని, దీనివల్ల బీపీ పెరిగి అక్కడ గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు.

కాలుష్యం కూడా ముప్పే

ఈ సీజన్ లో చలి, వాయుకాలుష్యం రెండింటి వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ అజిత్ జైన్ చెబుతున్నారు. వాయు కాలుష్యం కూడా శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే కాలుష్య కణాలు శ్వాస ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయి. ఈ కణాలు రక్తంలో నిక్షిప్తమై సిరల్లో అడ్డంకిని కూడా కలిగిస్తాయి. దీంతో రక్త సరఫరా సక్రమంగా జరగడం లేదు. దీంతో గుండెపై ఒత్తిడి పెరిగి గుండెపోటు రావచ్చు.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం లేదా ఊబకాయం ఉన్నవారికి శీతాకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ వ్యక్తులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి.

గుండెపోటు లక్షణాలు ఏమిటి?

  • ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి అనుభూతి
  • నొప్పి ఛాతీ నుండి ఎడమ చేయి లేదా వైపుకు వెళుతుంది
  • శ్వాసకోశ ఇబ్బందులు
  • తల తిరగడం
  • వికారం – వాంతులు
  • ఛాతీలో భారం.. నొప్పి లాంటి పరిస్థితి

శీతాకాలంలో గుండెపోటును ఎలా నివారించాలి

  1. పండ్లు – కూరగాయలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి
  2. ఉదయం – సాయంత్రం తక్కువ ఉష్ణోగ్రతలలో వ్యాయామం చేయడం మానుకోండి
  3. ధూమపానం చేయవద్దు
  4. మద్యం తాగవద్దు
  5. మీ కొలెస్ట్రాల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి
  6. ఆస్పిరిన్ వంటి మందులను మీ దగ్గర ఉంచుకోండి
  7. వెచ్చని బట్టలు ధరించడం
  8. ఫాస్ట్ ఫుడ్ మానుకోండి
  9. మీ బిపిని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి
  10. ఇలా మంచి ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలితో గుండెను భద్రంగా ఉంచుకోవచ్చు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?