AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acidity: మీరు అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? ఈ 4 ఆహారాలతో చెక్‌!

Health Tips: ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మారుతున్న జీవన విధానం కారణంగా చాలా మందికి రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు..

Acidity: మీరు అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? ఈ 4 ఆహారాలతో చెక్‌!
Subhash Goud
|

Updated on: Nov 22, 2024 | 5:47 PM

Share

చెడు ఆహారపు అలవాట్ల కారణంగా అధిక సంఖ్యలో ప్రజలు కడుపు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధులలో అసిడిటీ కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఎసిడిటీని నివారించడానికి సరైన ఆహారపు అలవాట్లను పాటించడం చాలా ముఖ్యం. స్పైసీ ఫుడ్ తినడం మానుకోండి. అసిడిటీని నివారించడానికి మీరు మందులకు బదులుగా కొన్ని ఆహారాలను తీసుకోవచ్చు. మీ ఎసిడిటీని తొలగించడంలో సహాయకరంగా ఉండే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

రోజూ బాదంపప్పును తీసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం

బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు అనిపించడం వల్ల మళ్లీ మళ్లీ తినాలనే కోరిక ఉండదు. ఎసిడిటీ నుంచి బయటపడవచ్చు. ఇది కాకుండా, బాదం కడుపులో ఉండే యాసిడ్‌ను కూడా గ్రహించి, గుండెల్లో మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పుదీనా తింటే పొట్ట చల్లబడుతుంది

పుదీనా ఆకులను తీసుకోవడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది. మీరు యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడుతుంటే, మీరు పుదీనా చట్నీని తినవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల పొట్టకు తాజాదనం వస్తుంది. మీరు కడుపు, ఛాతీలో మంట నుండి ఉపశమనం పొందవచ్చు.

అల్లంతో ఎసిడిటీకి చెక్‌

అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మిమ్మల్ని ఎసిడిటీ నుంచి కాపాడుతుంది. దీని వినియోగం మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కడుపు నొప్పి నుండి ఉపశమనం కూడా అందిస్తుంది. దీని కోసం మీరు టీ లేదా ఏదైనా ఇతర పానీయాలలో అల్లం తీసుకోవచ్చు.

బొప్పాయి జీర్ణవ్యవస్థకు కూడా మంచిది

బొప్పాయిలో పపైన్ అనే సహజ ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. మెరుగైన జీర్ణవ్యవస్థ మీ జీవక్రియను పెంచుతుంది. దీని కారణంగా మీరు ఎసిడిటీకి దూరంగా ఉండవచ్చు. బొప్పాయి తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..