AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mswati III: ప్రతి ఏడాది ఓ కన్యను పెళ్లి చేసుకునే రాజు.. 56వ ఏట 16వ పెళ్లి చేసుకున్నాడు..

కాల క్రమంలో వచ్చిన మార్పులతో అనేక రాజ్యాలు రాజుల పాలన నుంచి ప్రజాస్వామ్యం దిశా అడుగులు వేశాయి. ప్రజలు ఎంచుకున్న నేతలే ఆ దేశాన్ని పాలిస్తారు. ఒకవేళ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తే ఆ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పిస్తారు. అయితే నేటికీ కొన్ని దేశాలు కమ్యూనిజాన్ని అనుసరిస్తుంటే.. మరికొన్ని దేశాలు రాజరికాన్ని అనుసరిస్తున్నారు. తమ రాజ్యానికి రాజుగా ఏలుతూ తమ ఇష్టానుసారం చట్టాలను చేసుకుంటూ పాలన చేస్తూ ఉంటారు. దక్షిణాఫ్రికా, మొజాంబిక్ సమీపంలో ఉన్న ఓ ప్రాంతాన్ని మూడవ మస్వతి పాలిస్తున్నాడు. ఇప్పుడు ఈ రాజు తన పెళ్ళిళ్ళతో వార్తల్లో నిలిచాడు.

Mswati III: ప్రతి ఏడాది ఓ కన్యను పెళ్లి చేసుకునే రాజు.. 56వ ఏట 16వ పెళ్లి చేసుకున్నాడు..
Mswati Iii 16th Wife
Surya Kala
|

Updated on: Nov 22, 2024 | 7:15 PM

Share

ప్రపంచంలో నేటికీ ప్రజాస్వామ్యాన్ని అనుసరించని దేశాలున్నాయి. కొన్ని దేశాల్లో రాజరిక వ్యవస్థ కొనసాగుతోంది. అక్కడ రాజులు తమ ఇష్టానికి అనుగుణంగా చట్టాలు రూపొందించుకుని నిరంకుశ పాలన చేస్తూ ఉంటారు. అలాంటి రాజరికం ఉన్న ప్రదేశం దక్షిణాఫ్రికా, మొజాంబిక్ సమీపంలో ఉంది. దీనిని స్వాజిలాండ్, ఇస్వతిని రాజ్యంగా పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని ఏలే రాజు మూడవ మస్వతి (Mswati III). తన రాజ్యంలోని ప్రజలు తినడానికి తిండి లేక అలో లక్ష్మణా అని ఆకలి కేకలు పెడుతుంటే.. రాజు మాత్రం ఏటేటా తన సంపదను పెంచుకుంటున్నాడు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఒక కన్యను పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటున్నాడు. దీంతో ఇప్పుడు ఈ దేశ రాజు మూడవ మస్వతి మళ్ళీ వార్తల్లో నిలిచాడు.

ఇస్వతిని రాజు మస్వతి (Mswati )III తన పనులతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఈ రాజ్యంలో ప్రతి ఏడాది ఆగష్టు లేదా సెప్టెంబరులో ఉమ్హ్లాంగా ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో 10,000 మందికి పైగా కన్యలు, యువతులు పాల్గొని రాజు మస్వతి ముందు డ్యాన్స్ చేస్తారు. అది కూడా ఈ యువతులు నగ్నంగా రాజు సహా ఉత్సవంలో చూడడానికి వచ్చిన వారి ముందు డ్యాన్స్ చేస్తారు. అప్పుడు ఆ స్త్రీలలో తనకు నచ్చిన యువతిని అది కూడా కన్యను కొత్త రాణిగా ఎన్నుకుంటాడు. ఇప్పటి వరకూ ఈ రాజుకి 16 మంది భార్యలు.. 45 మంది పిల్లలు ఉన్నారు.

అయితే ఇలా నగ్నంగా డ్యాన్స్ చేయడానికి ఎవరైనా యువతులు అంగీకరించక పొతే రాజు దృష్టికి తీసుకుని వెళ్తారు.అప్పుడు ఆ యువతికి కుటుంబానికి భారీగా జరిమానా విధిస్తారు. ఓ వైపు దేశంలోని జనాభా పేదరికంతో ఆకలితో అల్లాడుతుంటే .. మరోవైపు రాజు మస్వతి పాలనా విధానం మరింత ఇబ్బందులను కలుగజేస్తుందని ఆ దేశంలోని చాలా మంది యువతులు విమర్శ చేస్తున్నారు. అంతేకాదు రాజు కూడా విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ రాజు మన దేశానికి 2015లో లో తన భార్యలు, పిల్లలతో కలిసి వచ్చాడు. భారతదేశం ఆఫ్రికా సమ్మిట్ లో పాల్గొన్నాడు. ఆ సమయంలో అతని లగ్జరీ లైఫ్ పై తీవ్ర విమర్శలు తలెత్తాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..