Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత! 4న అంత్యక్రియలు
మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఉమ్మడి ఏపీలో ఐటీ మంత్రిగా పనిచేశారు. రాంరెడ్డి సోదరులుగా కాంగ్రెస్‌లో మంచి పట్టున్న ఈయన అంత్యక్రియలు శనివారం తుంగతుర్తిలో జరగనున్నాయి. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(73) బుధవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. శనివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.
దామోదర్‌రెడ్డి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. దామోదర్ రెడ్డి అన్న రాంరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రిగా పనిచేశారు. ఆయన 2016లో మరణించారు. రాంరెడ్డి బ్రదర్స్‌గా వీరికి కాంగ్రెస్‌లో మంచి పట్టు ఉండేది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




