తెలుగు వాళ్లు నష్టపోతున్నారు.. రైల్వే రిక్రూట్‌మెంట్ విధానంలో ప్రక్షాళన చేయాలి.. కేంద్రమంత్రికి వినోద్ కుమార్ లేఖ

Vinod Kumar on Railway Recruitment Board: రైల్వే రిక్రూట్ మెంట్ విధానంలో సమూల ప్రక్షాళన చేసి జోనల్ స్థాయిలోనే రైల్వే రిక్రూట్ మెంట్స్

తెలుగు వాళ్లు నష్టపోతున్నారు.. రైల్వే రిక్రూట్‌మెంట్ విధానంలో ప్రక్షాళన చేయాలి.. కేంద్రమంత్రికి వినోద్ కుమార్ లేఖ
Vinod Kumar
Shaik Madarsaheb

|

Jan 29, 2022 | 6:16 PM

Vinod Kumar on Railway Recruitment Board: రైల్వే రిక్రూట్ మెంట్ విధానంలో సమూల ప్రక్షాళన చేసి జోనల్ స్థాయిలోనే రైల్వే రిక్రూట్ మెంట్స్ జరపాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి (Central Govt) డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) కు టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ శనివారం లేఖ రాశారు. క్లర్క్ అండ్ అంతకు కింది స్థాయి పోస్టులకు జాతీయ స్థాయిలో పరీక్షలా..? ఇది విడ్డురమే అని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయి పరీక్షల వల్ల బీహార్, యూపీ రాష్ట్రాలదే పెత్తనం సాగుతోందని, ప్రాంతీయ భాషల రాష్ట్రాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రైల్వే గ్రూప్ సీ, డీ కేటగిరి పోస్టులకు జాతీయ స్థాయిలో ఎంపిక పరీక్షలు సరికాదని వినోద్ కుమార్ (B. Vinod Kumar) పేర్కొన్నారు.

రైల్వే పరీక్షల కోసం ఉత్తరాదిలో కోచింగ్ సెంటర్స్ మాఫియా లాగా పని చేస్తోందని, ఉత్తరాది కోచింగ్ సెంటర్స్ మాయాజాలం వల్ల తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదని వినోద్ కుమార్ తెలిపారు. 35 వేల రైల్వే పోస్టుల కోసం ఒక కోటి 30 వేల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. రైల్వే రిక్రూట్ మెంట్ వ్యవహారంలో బీహార్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడం, విధ్వంసక పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. చివరికి బీహార్ బంద్ వరకు వెళ్లడం వంటి సంఘటనలు తనను తీవ్రంగా కలిచి వేశాయని వినోద్ కుమార్ వివరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

రైల్వే మాజ్దూర్ యూనియన్, మాజ్దూర్ సంఘ్, రైల్వే మెన్ ఫెడరేషన్, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ఈ విషయంపై తనతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ భాష తెలుగులో రైల్వే రిక్రూట్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని వినోద్ కుమార్ కేంద్రానికి డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర భాషలోనే రైల్వే రిక్రూట్ మెంట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వే రిక్రూట్ మెంట్ విధానాన్ని తప్పు పడుతూ పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించానని వినోద్ కుమార్ తెలిపారు.

రైల్వే రిక్రూట్ మెంట్ ను జోనల్ స్థాయిలో ప్రాంతీయ భాషలోనే నిర్వహించాలని, ప్రస్తుత విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని వినోద్ కుమార్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

Also Read:

AP Coronavirus: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

Virat Kohli: విరాట్ కోహ్లీ వికెట్ అత్యంత ఇష్టం.. వారిని ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాలని ఉంది..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu