Siddipet: సిద్ధిపేటకు త్వరలోనే రైలు కూత.. తిరుపతి, బెంగళూరు, ముంబయికి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.

సిద్ధిపేట ప్రాంత ప్రజల దశాబ్ధాల కల సాకారం కానుంది. పట్టణానికి రైలు కూత పెట్టే సమయం ఆసన్నమైంది. మనోహరాబాద్‌-కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా జూలై చివరి లేదా ఆగస్టు మొదటి వారంలో సిద్ధిపేట వరకు రైల్వే లైన్‌ సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రాక్‌ నిర్మాణ పనులు దుద్దెడ వరకు పూర్తికాగా మరో రెండు నెలల్లో...

Siddipet: సిద్ధిపేటకు త్వరలోనే రైలు కూత.. తిరుపతి, బెంగళూరు, ముంబయికి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.
Railway
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 22, 2023 | 5:39 PM

సిద్ధిపేట ప్రాంత ప్రజల దశాబ్ధాల కల సాకారం కానుంది. పట్టణానికి రైలు కూత పెట్టే సమయం ఆసన్నమైంది. మనోహరాబాద్‌-కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా జూలై చివరి లేదా ఆగస్టు మొదటి వారంలో సిద్ధిపేట వరకు రైల్వే లైన్‌ సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రాక్‌ నిర్మాణ పనులు దుద్దెడ వరకు పూర్తికాగా మరో రెండు నెలల్లో సిద్ధిపేట వరకు ట్రాక్‌ను పూర్తి చేయాలని నిర్ణయించారు. అనంతరం రైలు సేవలు ప్రారంభించాలని చూస్తున్నారు. నిజానికి గజ్వెల్‌ వరకు ట్రాక్‌ పనులు పూర్తయిన తర్వాత ప్యాసింజర్‌ రైలు నడపాలని నిర్ణయించారు.

కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఆ తర్వాత రైలు ప్రారంభించాలని చూసినా.. సికింద్రాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు రైలు సేవలను వినియోగించుకునే వారు తక్కువగా ఉంటారన్న ఆలోచనతో ఆ ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. సిద్ధిపేట వరకు అయితే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని.. రోజుకు ఒకటి లేదా రెండు పుష్‌పుల్‌ రైలు ట్రిప్పులు నడపాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట నుంచి కాచిగూడకు రైలు నడపనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే తిరుపతి, బెంగళూరు, ముంబయి నగరాలకు సిద్ధిపేట నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడిపే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే కొన్ని సర్వీసులను సిద్ధిపేట నుంచి ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..