AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదు.. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ రద్దు పిటిషన్‌పై హైకోర్టు సూటి ప్రశ్న

పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం తర్వాత టీఎస్‌పీఎస్సీ పేరు మారుమోగుతోంది. ప్రతీ రోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా గ్రూప్‌ 1 పరీక్ష విషయంలో టీఎస్‌పీఎస్సీని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించినా వివాదాలు తప్పడం లేదు. ఇటీవల నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణలో తప్పిదాలు...

TSPSC: అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదు.. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ రద్దు పిటిషన్‌పై హైకోర్టు సూటి ప్రశ్న
TSPSC
Narender Vaitla
|

Updated on: Jun 22, 2023 | 5:10 PM

Share

పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం తర్వాత టీఎస్‌పీఎస్సీ పేరు మారుమోగుతోంది. ప్రతీ రోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా గ్రూప్‌ 1 పరీక్ష విషయంలో టీఎస్‌పీఎస్సీని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించినా వివాదాలు తప్పడం లేదు. ఇటీవల నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణలో తప్పిదాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోకుండా పరీక్ష నిర్వహించారని అభ్యర్థులు పిటిషన్‌లో తెలిపారు. ఓఎంఆర్‌ షీట్‌పై అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్‌, ఫొటో లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఈ అంశంపై గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓఎంఆర్ షీటుపై హాల్‌టికెట్ నంబరు, ఫోటో లేకపోవడంపై హైకోర్టు ప్రశ్నించింది. అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని టీఎస్పీఎస్సీని సూటిగా ప్రశ్నించింది. పరీక్షల్లో అక్రమాల నిరోధంలో కీలక అంశాలను విస్మరించారని వ్యాఖ్యానించింది.

దీంతో దీనికి టీఎస్‌పీఎస్సీ బదులిస్తూ.. బయోమెట్రిక్, ఓఎంఆర్‌పై ఫోటోకు రూ.1.50 కోట్లు ఖర్చవుతుందని వివరణ ఇచ్చింది. మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..