Bharat Jodo Yatra: తెలంగాణలో భారత్ జోడో యాత్ర పున:ప్రారంభం.. మధ్యాహ్నం రైతులతో రాహుల్ భేటీ..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో గురువారం పున:ప్రారంభమైంది. మూడు రోజుల విరామం అనంతరం రాహుల్ తెలంగాణలో రెండో రోజు పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో గురువారం పున:ప్రారంభమైంది. మూడు రోజుల విరామం అనంతరం రాహుల్ తెలంగాణలో రెండో రోజు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మక్తల్ శివారులోని సబ్ స్టేషన్ నుంచి ఉదయం 6.30 గంటలకు భారత్ జోడో పాదయాత్రను రాహుల్ గాంధీ పునఃప్రారంభించారు. రాహుల్ ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు చేయనున్నారు. ఇవాళ 26 కిలో మీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్న భోజనం అనందరం 2.30 కి తెలంగాణ రైతులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.
ఇవాళ రాహుల్ పాదయాత్ర మక్తల్.. కన్యకాపరమేశ్వరి దేవాలయం, పెద్ద చెరువు ట్యాంక్‌బండ్, దండు క్రాస్ రోడ్డుల మీదుగా కచ్వర్ గ్రామానికి చేరుకుంటుంది. మధ్యాహ్న భోజనం అనంతరం జక్లేర్ క్రాస్ రోడ్డు మీదుగా గుడిగండ్ల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఎలిగండ్ల వద్దకు చేరుకుని రాత్రి బస చేయనున్నారు.
కాగా, రాహుల్ పాదయాత్ర కోసం.. తెలంగాణ పీసీసీ భారీ ఏర్పాట్లు చేసింది. పాదయాత్రలో రాహుల్‌గాంధీ పలు ప్రజా సంఘాల ప్రతినిధులను, కార్మికులు, నారాయణపేట జిల్లాకు చెందిన బీడీ కార్మికులతో రాహుల్‌గాంధీ ముచ్చటిస్తూ పాదయాత్రను కొనసాగించనున్నారు.




కాగా, దీపావళి పర్వదినం, కాంగ్రెస్ చీఫ్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో రాహుల్‌గాంధీ పాదయాత్రకు మూడు రోజుల బ్రేక్ అనంతరం.. బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో మక్తల్‌కు చేరుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..