AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది.. ప్రత్యేక పూజల నిర్వహణ

శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది.. ప్రత్యేక పూజల నిర్వహణ
President Murmu Visit Yadadri Temple
Surya Kala
|

Updated on: Dec 30, 2022 | 4:32 PM

Share

తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము శుక్రవారం యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి శ్రీ  లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రెసిడెంట్‌ ముర్ముతో పాటు గవర్నర్‌ తమిళిసై కూడా నరసింహస్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు.

President Murmu Visit Yadadri Temple 1

President Murmu Visit Yadadri Temple 1

శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. లక్ష్మి నరసింహ స్వామీ ప్రధాన ఆలయ ప్రదేశాలను ముర్ము పరిశీలించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి
Murmu Visit Yadadri Temple 2

Murmu Visit Yadadri Temple 2

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..