AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కాళ్ళ పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య.. 8 నెలల క్రితం పెళ్లి.. మంచి కోడలిగా బంధువుల్లో పేరు..

అవును రవళి విషాదంతం మరవకముందే హైదరాబాద్‌ రాజేంద్రనగర్ లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నవ వధువు పుష్పాంజలి అనుమానాస్పదంగా మరణించింది. 

Hyderabad: కాళ్ళ పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య.. 8 నెలల క్రితం పెళ్లి.. మంచి కోడలిగా బంధువుల్లో పేరు..
Newly Wed Bride
Surya Kala
|

Updated on: Dec 26, 2022 | 8:33 PM

Share

పెళ్లంటే నూరేళ్ల పంట.. అయితే ఇప్పుడు పెళ్లంటే తమ జీవితంలో నయా తంటా అంటున్నారు కొంతమంది యువతలు.. అంతేకాదు.. కొత్త జీవితంలోకి అడుగు పెట్టక ముందే కొందరు బలైపోతుంటే.. మరికొందరు కాళ్ళ పారాణి ఆరకముందే.. కొత్త జీవితం పరిమళం తమనుంచి వీడక ముందే బలవంతంగా ప్రాణాలను తీసుకుని ఈ లోకాలను వీడుతున్నారు. అవును రోజు రోజుకీ రకరకాల రీజన్స్ తో బంగారు తల్లులు బలైపోతున్నారు. మొన్నటికి మొన్న నిజామాబాద్‌లో నవ వధువు రవళి ఆత్మహత్య చేసుకుంది.   తెల్లారితే పెళ్లి..రాత్రి వరకు బంధుమిత్రులతో ఆనందంగా డ్యాన్సు చేసిన రవళి.. తాళికట్టే వేళకు ముందే శవమై కన్పించింది. ఈ ఘటన మరవక ముందే మళ్ళీ మరొక నవ వధువు బలవంతంగా ప్రాణాలను తీసుకుంది. అవును రవళి విషాదంతం మరవకముందే హైదరాబాద్‌ రాజేంద్రనగర్ లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నవ వధువు పుష్పాంజలి అనుమానాస్పదంగా మరణించింది.

అత్తాపూర్ కు చెందిన కిరణ్ కుమార్ తో పుష్పాంజలికి 8 నెలల క్రితం వివాహం అయింది. ఈడు జోడు బాగుందనుకున్నారంత. ఆమె కూడా అత్తారింట్లో సర్దుకుపోయింది. కిరణ్‌ తల్లి చనిపోయింది. తండ్రి కి అనారోగ్యం. ఆయన ఇంట్లోనే ఉంటారు. తక్కువ టైమ్‌లోనే బంధువుల్లో మంచి పేరు తెచ్చుకుంది పుష్పాంజలి. కానీ ఇంతలోనే ఘోరం.. నవ వధువు పుష్పాంజలి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం స్థానికంగా సంచలనం రేపింది.  ఎప్పట్లానే కిరణ్‌ డ్యూటీకి వెళ్లాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని పుష్పాంజలి ఆత్మహత్య  చేసుకుంది.

ఎంత పిలిచినా పుష్పాంజలి పలకకపోవడంతో భర్తకు సమాచారం ఇచ్చి డోర్‌నుబద్దలు గొట్టారు. లోనికి వెళ్లి చూస్తే ఫ్యాన్‌కు వేలాడుతుంది. వెంటనే భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టమ్‌ కు తరలించారు. ఆత్మహత్యా? మరేదైనా కోణం వుందా? సూసైడ్‌ చేసుకొని వుంటే అందుకు కారణాలేంటి? ఏం జరిగింది? పుష్పాంజలిది ఆత్మహత్యా? మరేదైనా కోణం వుందా? దర్యాప్తులో కొత్త కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి పది గంటలకు పుష్పాంజలి తన సోదరికి ఫోన్‌ చేసింది. అర్జెంట్‌గా చూడాలని..మాట్లాడాలని వుందని చెప్పింది. ఇంతలోనే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

పుష్పాంజలి తన సోదరితో ఏం చెప్పాలనుకుంది. కొత్త కాపురంలో కలతలొచ్చాయా? కట్న వేధింపులా? మరేవైనా గొడవలున్నాయా? భర్త వైఖరి వల్లే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందా? ఇలా ఎన్నెన్నో అనుమానాలు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక నిజానిజాలేంలో విచారణలో తేలాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..