TRS MLAs Poaching Case: నందు నాకు పరిచయమే.. కానీ, ఆ విషయంలో మాత్రం.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాజా కామెంట్స్..

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు.

TRS MLAs Poaching Case: నందు నాకు పరిచయమే.. కానీ, ఆ విషయంలో మాత్రం.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాజా కామెంట్స్..
Mla Pilot Rohith Reddy
Follow us

|

Updated on: Dec 26, 2022 | 9:05 PM

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. ఇదే అంశంపై ప్రత్యేకంగా టీవీ9తో మాట్లాడిన ఆయన.. ఈ కేసులో తాము అనుకున్నట్లే జరుగుతోందన్నారు. సీబీఐ, ఐటీ, ఈడీ లను వాడుతారని ముందే చెప్పామని, అదే విధంగా జరుగుతోందన్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. తనను కొనడంకోసం బీజేపీ ఏ రకంగా ప్రయత్నించిందో ఆ వివరాలన్నింటినీ సీబీఐకి ఇస్తానని చెప్పారు రోహిత్ రెడ్డి. తాను ఎలాంటి తప్పు చేయలేదని, సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని తెలిపారు ఎమ్మెల్యే. ఈ కేసులో నిందితుడైన నందుతో తనకు పరిచయం ఉందన్న రోహిత్ రెడ్డి.. అతనిలో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టం చేశారు.

కాగా, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని బీజేపీ, నిందితులు వేసిన పిటిషన్‌ విచారించిన హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. బీజేపీ వేసిన పిటిషన్‌ తిరస్కరించిన బెంచ్‌.. నిందితుల వాదనతో మాత్రం ఏకీభవించింది. సిట్‌ విచారణ సరిగ్గా జరగడం లేదని అభిప్రాయపడిన కోర్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్‌ విచారణలోని అంశాలు సీబీఐకి అప్పగించాలని కూడా ఆదేశించింది.

మొత్తానికి బీజేపీ మొదటి నుంచి కోరుకుంటున్నట్టు ఈ వ్యవహారం రాష్ట్ర పోలీసుల నుంచి కేంద్రం దర్యాప్తు సంస్థ చేతికి వెళ్లింది. వివిధ రాష్ట్రాలు పర్యటించి ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన సిట్‌ బీఎల్ సంతోష్‌ వంటి బీజేపీ అగ్ర నాయకులకు కూడా నోటీసులు ఇచ్చింది. అయితే, హైకోర్టు తీర్పుతో కేసు సీబీఐ చేతికి పోనుంది. ఇక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం వద్దకు వెళ్లాలని సలహా ఇస్తున్నారు మాజీ అధికారులు. దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చిన హైకోర్ట్‌.. తీర్పు తుది కాపీ వచ్చే వరకు జడ్టిమెంట్‌ను సస్పెన్షన్‌లో పెట్టింది. పైనల్ కాపీ వచ్చే దాకా ఆర్డర్‌ను సస్పెన్షన్‌లో పెట్టాలని అడ్వకేట్ జనరల్‌ విఙ్ఞప్తి చేశారు. రేపు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది.

కేసులో ఎప్పుడు ఏం జరిగిందంటే..

అక్టోబర్‌ 26 – వెలుగులోకి ఎమ్మెల్యేల కోనుగోలు కేసు

అక్టోబర్‌ 26 – రామచంద్రబారతి, నందకుమార్‌, సింహయాజి అరెస్టు

అక్టోబర్‌ 27 – ఏసీబీ కోర్టుకు నిందితులు, రిమాండ్‌ రిజెక్ట్‌

అక్టోబర్‌ 28 – ఏసీబీ కోర్టు తీర్పు హైకోర్టులో సవాల్‌

అక్టోబర్‌ 29 – ఏసీబీ కోర్టు తీర్పు కొట్టివేత, రిమాండ్‌

అక్టోబర్‌ 29 – సీబీఐకి అప్పగించాలని బీజేపీ పిటిషన్‌, నవంబర్‌4 వరకు స్టే

అక్టోబర్‌ 29 – ఎలాంటి చర్యలు వద్దని ఆదేశం

నవంబర్‌ 8 – స్టే ఎత్తివేత

నవంబర్‌ 9 – సీవీ ఆనంద్‌తో పాటు 6గురితో SIT

నవంబర్‌ 9 – ముగ్గురు నిందితుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి

నవంబర్‌ 14 – SIT దర్యాప్తుపై బీజేపీ, నిందితులు సవాల్‌, CBIకి ఇవ్వాలని పిటిషన్‌

నవంబర్‌ 18 – BL సంతోష్‌కు నోటీసులు

డిసెంబర్‌ 1- ముగ్గురికి హైకోర్టులో బెయిల్‌

డిసెంబర్‌ 16 – సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

డిసెంబర్‌ 26 – CBIకి అప్పగించిన హైకోర్టు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..