RRB Group-D Final Results: జనవరి 12 నుంచి ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు
ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి సికింద్రాబాద్ (RRC 01/2019) రాత పరీక్షల ఫలితాలు డిసెంబర్ 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఇక తదుపరి ఘట్టమైన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు జనవరిలో నిర్వహించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్ వెల్లడించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు..
ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి సికింద్రాబాద్ (RRC 01/2019) రాత పరీక్షల ఫలితాలు డిసెంబర్ 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఇక తదుపరి ఘట్టమైన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు జనవరిలో నిర్వహించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్ వెల్లడించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జనవరిలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు నిర్వహిస్తారు. సికింద్రాబాద్ జోన్‌లో దాదాపు 24,596 మంది పీఈటీ పరీక్షలకు ఎంపికయ్యారు. వీరందరికీ సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ గ్రౌండ్‌లలో జనవరి 12 నుంచి 21 వరకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు నిర్వహించనున్నారు.
శారీరక సామర్థ్య పరీక్షలకు (పీఈటీ) ఎంపికైన వారి పేర్లు, రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్, కమ్యూనిటీ, పీఈటీ తేదీ, నిర్వహణ స్థలం వంటి ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వికలాంగ అభ్యర్ధులకు పీఈటీ పరీక్షల నుంచి మినహాయింపు ఉండటంతో వారి ఫలితాలను తర్వాత ప్రకటిస్తామని రైల్వేశాఖ తెల్పింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.