AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రభుత్వాస్పత్రిలో ఒకే రోజున పుట్టిన శిశువుల తారుమారు.. ఆడశిశువుకి బదులు మగ శిశువుని ఇవ్వడంతో ఆందోళన

చెన్నూరు మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన మమతా అనే గర్భిణీ ప్రసవం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. దీంతో విధుల్లో ఉన్న వైద్యులు శస్త్ర చికిత్స చేసి మమతకు పురుడు పోశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పావని అనే గర్భిణీకి కాన్పు చేశారు.

Telangana: ప్రభుత్వాస్పత్రిలో ఒకే రోజున పుట్టిన శిశువుల తారుమారు.. ఆడశిశువుకి బదులు మగ శిశువుని ఇవ్వడంతో ఆందోళన
Children Exchange In Govt Hospital
Surya Kala
|

Updated on: Dec 29, 2022 | 7:24 PM

Share

ఆస్పత్రి సిబ్బంది అత్యుత్సాహం తీవ్ర ఆందోళనకు దారితీసింది. శిశువుల తారుమారు పంచాయితీ రచ్చకెక్కింది. ముందుగా మగబిడ్డ అని, తర్వాత ఆడపిల్ల పుట్టిందని చెప్పడంతో కుటుంబ సభ్యుల మధ్య గందరగోళం చెరరేగింది. అంతకీ ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాం.. అయితే ఇపుడు తెలంగాణలోని ఓ ప్రభుత్వాస్పత్రిలో సినిమా సీన్ ను తలపిస్తూ.. ఓ ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో గందరగోళం చెలరేగింది. ఆస్పత్రి సిబ్బంది అత్యుత్సాహం వల్ల ఒకే రోజు పుట్టిన ఇద్దరు శిశువులు తారుమారు అయ్యారు. దీంతో బాలింతల కుటుంబ సభ్యులు ఆస్పత్రి తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.

చెన్నూరు మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన మమతా అనే గర్భిణీ ప్రసవం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. దీంతో విధుల్లో ఉన్న వైద్యులు శస్త్ర చికిత్స చేసి మమతకు పురుడు పోశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పావని అనే గర్భిణీకి కాన్పు చేశారు. దీంతో ఒకరికి ఆడ, మరొకరికి మగ శిశువు జన్మించారు. ఆడ శిశువును ఇవ్వాల్సిన బాధిత బంధువులకు మగ శిశువును ఇవ్వడంతో ఆందోళన మొదలైంది.

తరువాత తేరుకున్న సిబ్బంది ఒకరికి ఇవ్వాల్సిన శిశువును మరొకరికి ఇచ్చామని చెప్పినప్పటికీ బాలింతల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కావాలంటే డీఎన్ ఏ టెస్టుకైనా సిద్ధమని చెబుతున్నారు. బాలింతల కుటుంబ సభ్యులకు చెప్పినా వినిపించుకోవడం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ హరిచంద్రారెడ్డి తెలిపారు. అయితే ఎవరికి ఆడ, ఎవరికి మగ శిశువులు అనేది తేలే వరకు ఇద్దరు శిశువులను శిశు సంక్షేమ శాఖకు అప్పగిస్తామని వెల్లడించారు. ఇక బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు డీఎన్ ఏ టెస్టు చేసిన తరువాత ఫలితం వచ్చాక మీ శిశువులను మీకిస్తాము. ఫలితాలు రావడానికి రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..