Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ.. అధికారమే లక్ష్యంగా రంగంలోకి దిగిన జాతీయ నేత..

రానున్న తెలంగాణ ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ మరో అడుగు ముందుకు వేసింది. ఈ మేరకు జాతీయ నాయకులు కూడా తెలంగాణలో అడుగుపెట్టారు. ఎట్టి పరిస్థితిల్లోనూ 2023 తర్వాత

Telangana: దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ.. అధికారమే లక్ష్యంగా రంగంలోకి దిగిన జాతీయ నేత..
Bl Santhosh Enters Into Telangnana Politics With Target 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 29, 2022 | 7:33 PM

రానున్న తెలంగాణ ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ మరో అడుగు ముందుకు వేసింది. ఈ మేరకు జాతీయ నాయకులు కూడా తెలంగాణలో అడుగుపెట్టారు. ఎట్టి పరిస్థితిల్లోనూ 2023 తర్వాత రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉండాలంటూ అధిష్టానం ఇచ్చిన రోడ్‌మ్యాప్‌‌ ‘మిషన్‌ 90’తో తెలంగాణ యూనిట్ కూడా కదనరంగంలోకి దిగింది. అందుకు ముందుగా ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’తో అవసరమైన చోట నేతలకు వలవేసి మరీ నియోజకవర్గాల్లో బలపడాలనుకుంటోంది. ఈ క్రమంలోనే  బీజేపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తెలంగాణ రాజకీయ రంగంలోకి దిగడంతో ప్రత్యర్ధి పార్టీలు కూడా అలర్ట్‌ అయ్యాయి. తమ పార్టీ నుంచి ఎవరూ పార్టీ వీడకుండా జాగ్రత్త పడుతున్నాయి కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ పార్టీలు.

తెలంగాణలో జెండా ఎగరేయడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ఈ రోజు(డిసెంబర్ 29) కీలక సమావేశం నిర్వహించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా మిషన్‌ 90 ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే బల‌హీన‌మైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు.. పార్టీ బ‌ల‌హీనంగా ఉండి బ‌ల‌మైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీల వివ‌రాలను ఇప్పటికే రెడీ చేసుకున్నారు రాష్ట్ర బీజేపీ నాయకులు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై అయితే స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇక వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు అవ‌స‌ర‌మైన వ్యూహాలు, ప్రణాళిక‌లు, ప్రత్యర్థి పార్టీల బ‌ల‌హీన‌త‌లు, విధాన ప‌ర‌మైన హామీల్లాంటి అంశాలతో డిటైల్డ్ రిపోర్ట్‌ రోడ్‌మ్యాప్ సిద్ధమైంది.

ఇప్పటికే 119 అసెంబ్లీ నియోజకవర్గలకు పాలక్‌లను ప్రటించిన బీజేపీ.. వాళ్లంతా నెలలో మూడు రోజులపాటు కేటాయించిన అసెంబ్లీలో ఉండాలని ఆదేశించింది. మరోవైపు బీజేపీ చేరికల కమిటీ కూడా దూకుడు పెంచింది. బలమైన లీడర్స్ కోసం వేట మొదలుపెట్టింది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను ఇప్పటికే లిస్ట్‌ ఔట్ చేసినట్లు సమాచారం. బలమైన నేతలు వస్తామంటే పార్టీ తలపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న సంకేతాలను బీజేపీ నేతలు బహిరంగంగానే ఇచ్చారు. అయితే కేడర్‌, లీడర్లు లేని బీజేపీ ఇతర పార్టీల నాయకులను కొనేందుకు ఈ పార్టీ కుట్రలకు తెగబడుతోందని ఆరోపించింది కాంగ్రెస్. బీజేపీ తీరును విమర్శిస్తూనే తమ నేతలు చేజారిపోకుండా అలర్ట్‌ చేస్తోంది ఆ పార్టీ. మొత్తానికి తెలంగాణలో 2023 రాజకీయ రణరంగంలోకి బీజేపీ దూకుడుగా వస్తోంది. మరి ప్రత్యర్ధి పార్టీలు ఎలాంటి కౌంటర్‌ యాక్షన్‌తో వస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఫామ్‌హౌస్‌ కేసుపై బీఎల్ సంతోష్‌ స్పందన:

మునుగోడు ఉప  ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హస్తం కూడా ఉందని ఆ పార్టీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మోయినాబాద్ ఫాంహౌస్‌ వేదికగా చెలరేగిన ఈ దుమారంతో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీఎల్ సంతోష్‌పై కూడా అనేక వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. వీటిపై సంతోష్ స్పందించారు. ‘నాపై చేసిన ఆరోపణలకు తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తప్పుడు ఆరోపణలకు పర్యావసానాలు ఎదుర్కోక తప్పదు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులు..ప్రజాస్వామ్యనికి శాపం. హైదరాబాద్ సంపాదనను రాజకీయ అవసరాలకు వాడుతున్నారు. హైదరాబాద్‌ నుంచి దేశమంతా డబ్బులు పంపుతున్నారు. – నేను ఎవరికీ తెలియదు కానీ. – తెలంగాణలో ప్రతి ఇంటికి నా పేరును తీసుకెళ్లారు టీఆర్ఎస్ నేతలు’  అని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..