Masala Tea: మీరు ఎప్పుడైనా మసాలా టీ తాగారా..? దీని ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..

శీతాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలంటే అందరికీ తెలిసిన, ఉత్తమైన మార్గం టీ తాగడమే. ఇక టీలలో అనేక రకాలు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రభావవంతమైనది ఏమైనా ఉందా అంటే..

Masala Tea: మీరు ఎప్పుడైనా మసాలా టీ తాగారా..? దీని ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..
Masala Tea Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 29, 2022 | 6:42 PM

శీతాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలంటే అందరికీ తెలిసిన, ఉత్తమైన మార్గం టీ తాగడమే. టీ కారణంగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.  ఇక టీలలో మసాలా టీ, బాదం టీ, టీ, కొత్తిమీర టీ, కరివేపాకు టీ ఇలా అనేక రకాలు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రభావవంతమైనది ఏమైనా ఉందా అంటే అది మసాలా టీ మాత్రమే. ఇది మన శరీరంలో వేడిని పెంచి, చల్లని వాతావరణాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. మసాలా టీ కోసం దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు, జాజికాయ, కుంకుమపువ్వు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలను వాడతారు.  ఈ మసాలా దినుసులు మన శరీరాన్ని వేడి ఉంచడమే కాక జీవక్రియను, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి.

మసాలా టీ మన శరీరానికి  వెచ్చదనం, నాలుకకు రుచిని అందించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి వాపు, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే బరువు తగ్గడం, జీర్ణక్రియలో కూడా సహాయపడుతుంది. కెఫీన్‌తో ఉండే ఇతర టీల కంటే మసాలా టీని అనేక ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుంది. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

రోగనిరోధక శక్తి: మసాలా టీలోని యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే జలుబు,ఫ్లూ, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

ఇవి కూడా చదవండి

వాపు: మంట, నొప్పిని తగ్గించడంలో మసాలా టీ సహాయపడుతుంది. కుంకుమపువ్వు కలిపిన మసాలా టీ లేదా వేడి నీటిలో కొన్ని లవంగాలను వేసి తాగడం వల్ల శరీరంలో మంట ప్రభావం తగ్గుతుంది. 

బరువు తగ్గడం: మసాలా టీలలో కేలరీలు తక్కువగా ఉన్నా పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారు మసాలా టీలో కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు. అలా చేయడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. 

రక్త ప్రసరణ: చలికాలంలో మన శరీర కండరాలు బిగుసుకుపోవడం వల్ల రక్త ప్రసరణ బలహీనపడుతుంది. దాల్చిన చెక్క ఎక్కువగా ఉన్న మసాలా టీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది.

మెరుగైన జీర్ణక్రియ: అల్లం, పుదీనాతో చేసిన మసాలా టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గమనిక: టీ మన ఆరోగ్యానికి మంచిదే. కానీ మితిమీరి తాగితే అది అనేక సమస్యలకు కారణమయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి పరిమితంగా తాగడమే ఉత్తమమని గ్రహించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..