Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు.. త్వరలో ప్రమాణ స్వీకారం..
Telangana High Court: తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు కొత్త జడ్జిల నియామకాలకు..
Telangana High Court: తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు కొత్త జడ్జిల నియామకాలకు ఆమోదముద్ర వేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రెసిడెంట్ గ్రీన్‌సిగ్నల్‌తో వారి నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. న్యాయమూర్తులు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేశ్ భీమపాక, పుల్ల కార్తీక్, కాజా శరత్, జె. శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వరావు.. తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా రానున్నారు. ఈ ఆరుగురు న్యాయమూర్తులు త్వరలోనే ప్రమాణం చేయనున్నారు.
కాగా, 2019 జనవరి 1న ప్రత్యేక రాష్ట్ర హైకోర్టుగా తెలంగాణ హైకోర్టు ఏర్పడింది. హైకోర్టులో మొత్తం ఉండాల్సిన న్యాయమూర్తులు 42 కాగా, ప్రస్తుతం 28 మంది ఉన్నారు. తాజాగా ఆరుగురి నియామకంతో ఆ సంఖ్య 34కి చేరింది. కాగా, ఏడాది వ్యవధిలో తెలంగాణ హైకోర్టులో 24 మంది న్యాయమూర్తులుగా నియమించారు. ఇకపోతే తాజా ఉత్తర్వుల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 6 హైకోర్టుల్లో 26 మంది న్యాయమూర్తుల నియామకం జరిగింది. దాంతో ఏడాది కాలంలో దేశంలో 127 మంది జడ్జీల నియామకం జరిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..