AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రియుడి మోజులో పడి భర్త హత్యకు సుపారీ.. పలు మార్లు విఫలయత్నం.. చివరికి

అతను.. భార్య చనిపోవడంతో వేరే మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆమె.. ప్రియుడి మోజులో పడి భర్తను వదిలించుకోవాలనుంది. అందుకోసం భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. పలు మార్లు విఫలయత్నం చేసి ఆఖరుకు కిరాయి...

Telangana: ప్రియుడి మోజులో పడి భర్త హత్యకు సుపారీ.. పలు మార్లు విఫలయత్నం.. చివరికి
Munugodu Firing Incident
Ganesh Mudavath
|

Updated on: Aug 13, 2022 | 3:09 PM

Share

అతను.. భార్య చనిపోవడంతో వేరే మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆమె.. ప్రియుడి మోజులో పడి భర్తను వదిలించుకోవాలనుంది. అందుకోసం భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. పలు మార్లు విఫలయత్నం చేసి ఆఖరుకు కిరాయి రౌడీలతో హత్యాయత్నం చేయించింది. పిస్తోల్ తో కాల్పులు జరిపించింది. తీవ్ర గాయాలతో బాధితుడు ఆస్పత్రి పాలయ్యాడు. పోలీసులు వెంటనే ఈ కేసుపై విచారణ చేపట్టి అసలైన నిందితులను అరెస్టు చేశారు. తెలంగాణలోని నల్గొండ (Nalgonda) జిల్లా మర్రిగూడ మండలం తుమ్మడవల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ.. హైదరాబాద్‌ వనస్థలిపురంలో నివాసముంటున్నాడు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆయన భార్య గతంలో మృతి చెందింది. ఈ క్రమంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి సంబంధానికి అడ్డుగా వస్తున్న తన భర్త స్వామిని చంపేయాలని నిర్ణయించుకుంది. బాలకృష్ణ, ఆ మహిళ ఇద్దరూ కలిసి.. మాల్‌కు చెందిన రామస్వామితో సుపారీ మాట్లాడుకున్నారు. స్వామిని హత్య చేస్తే రూ.3 లక్షలు ఇస్తామని బేరం కుదుర్చుకున్నారు. ముందుగా రూ.1.70 లక్షలు ఇచ్చాడు. స్వామిని హత్య చేసేందుకు రామస్వామి పలుమార్లు విఫలయత్నం అయ్యాడు.

దీంతో బాలకృష్ణ తన ఇంట్లో ప్లంబర్‌గా పని చేస్తున్న యూసుఫ్ తో రూ.12.లక్షలకు మరోసారి సుపారీ కుదుర్చుకున్నాడు. ముందుగా రూ.5 లక్షలు చెల్లించాడు. మహిళ తన దగ్గర ఉన్న రూ.లక్ష ఇచ్చింది. డబ్బులు అందడంతో యూసుఫ్‌ తన స్నేహితులు అబ్దుల్‌ రహమాన్‌పాషా, ఆసీఫ్ ఖాన్‌, జహంగీర్‌ల సహాయంతో పిస్టల్‌తో స్వామిని చంపేందుకు ప్లాన్ వేశారు. ఈ నెల 4న మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో బైక్ పై వస్తున్న స్వామిపై అబ్దుల్‌ రహమాన్‌పాషా, జహంగీర్‌లు పిస్టోల్ తో కాల్పులు జరిపారు. ఆ శబ్దానికి స్థానికులు రావటంతో నిందితులు పరారయ్యారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని స్వామిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా ఈ విషయాలు తెలిశాయి. మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక పిస్టోల్‌, 9 మొబైల్‌ ఫోన్లు, రూ.4,500 స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి