Guntur: రైల్వే స్టేషన్‌లో పోలీసులకు చూడగానే పరిగెత్తబోయిన RMP డాక్టర్.. పట్టుకుని అతని బ్యాగ్ చెక్ చేయగా
RMP డాక్టర్ ట్రాక్ తప్పాడు. ఈజీ మనీ కోసం అడ్డదారిని ఎన్నుకుని అడ్డంగా బుక్కయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
AP Crime News: అతడో RMP డాక్టర్. అంతకంటే షార్ట్‌గా వివరించాలంటే కంత్రీ పనులకు మాస్టర్. జల్సాలకు అలవాటుపడ్డాడు. దీంతో పని చేయగా వచ్చిన డబ్బు చాలడం లేదు. ఈ క్రమంలో అతడి మనసు దొంగతనాల వైపు మళ్లింది. ట్రైన్లలో అయితే పెద్దగా టెన్షన్ ఉండదని భావించాడు. ఆ దిశగా స్కెచ్ రెడీ చేశాడు. జూలై 28న కాచీగూడ ఎక్స్‌ప్రెస్(Kacheguda Express) ఎక్కాడు. ఓ వ్యక్తి బ్యాగుపై అతడి కన్ను పడింది. అనుకున్నదే తడవుగా దాన్ని భుజానికి తగిలించుకుని ట్రైన్ దిగేశాడు. అతడి ప్లాన్ వర్కువుట్ అయ్యింది. బ్యాగులో 8 లక్షల డబ్బు ఉంది. దీంతో ఫుల్ ఎంజాయ్ చేశాడు. కాగా బ్యాగ్ పోగొట్టుకున్న శ్రీనివాసరావు గవర్నమెంట్ రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. రేపల్లె నుంచి గుంటూరు వస్తుండగా తన బ్యాగ్ పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో వారు కేసు ఫైల్ చేసి.. అనుమానితుల కదిలికలపై ఫోకస్ పెట్టారు. అయితే ఈ ఆగష్టు 12న ఓ వ్యక్తి గుంటూరు రైల్వే స్టేషన్‌లో పోలీసులను చూడగానే.. బ్యాగ్ తగిలించుకుని పరారయ్యేందుకు ప్రయత్నంచాడు. దీంతో అనుమానం వచ్చి.. అతడిని అదుపులోకి తీసుకుని బ్యాగ్ చెక్ చేయగా.. లోపల 4 లక్షల డబ్బు కనిపించింది. విచారించగా అతడి నేరం బయటపడింది. నిందితుడిని బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ప్రవీణ్‌గా గుర్తించారు. మొత్తం 8 లక్షల్లో 4 లక్షలు ఇప్పటికే ఖర్చు పెట్టేశాడు. మిగిలిన డబ్బును భట్టిప్రోలులో దాచేందుకు వెళ్తుండగా బుక్కయ్యాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..