AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponguleti Srinivasa Reddy: లోక్‌సభ ఎన్నికల బరిలో పొంగులేటి ఇద్దరు వియ్యంకులు.. ఒకరు ఖమ్మం నుంచి.. మరొకరు

ఇప్పుడు ఈయన ఇద్దరు వియ్యంకుల ముద్దుల మినిస్టర్‌. వియ్యంకులిద్దరూ లోక్‌సభ బరిలో నిలిచారు. పార్టీలు వేరు, ప్రాంతాలు వేరు.. కాని ఇద్దరు వియ్యంకులు ఎంపీగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇద్దరు వియ్యంకుల ముద్దుల మినిస్టర్‌గా ఎలా మారారు..

Ponguleti Srinivasa Reddy: లోక్‌సభ ఎన్నికల బరిలో పొంగులేటి ఇద్దరు వియ్యంకులు.. ఒకరు ఖమ్మం నుంచి.. మరొకరు
Ponguleti Srinivasa Reddy
Ram Naramaneni
|

Updated on: Apr 25, 2024 | 7:18 AM

Share

మంత్రి పొంగులేటి ఇద్దరు వియ్యంకులు ఎన్నికల బరిలో నిలిచారు. ఒకరు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి అయితే ఇంకొకరు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. ఈ ఇద్దరు పొంగులేటికి వియ్యంకులు. మంత్రి పొంగులేటికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు తాజాగా ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కించుకున్న రామసహాయం రఘురాంరెడ్డి ఇంటి కోడలు. వాస్తవానికి ఖమ్మం టికెట్‌పై కాంగ్రెస్‌లో నానాహైరానా, తర్జనభర్జన సాగింది.. అనేక మంది పోటీపడ్డారు. ఓ వైపు భట్టి ఫ్యామిలీ, మరోవైపు పొంగులేటి ఫ్యామిలీ.. టికెట్ నీదా.. నాదా అన్నట్లుగా పోటీపడ్డాయి. తన సోదరుడికి టికెట్ ఇప్పించుకునేందుకు పొంగులేటి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే వివిధ సమీకరణాల్లో భాగంగా టికెట్ పొంగులేటి సోదరుడికి దక్కకుండా అనూహ్యంగా వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డికి దక్కింది.

Raghuram Reddy

Raghuram Reddy

రఘురామిరెడ్డి.. ప్రస్తుతం వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను, చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిని వివాహం చేసుకున్నారు. రఘురాం రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా పనిచేశారు.

ఇక పొంగులేటి మరో వియ్యంకుడు మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. పొంగులేటి తమ్ముడు ప్రసాద్‌రెడ్డి కుమారుడు వెంకట్రామిరెడ్డి ఇంటి అల్లుడు. పరోక్షంగా, బంధుత్వపరంగా పొంగులేటికి వెంకట్రామిరెడ్డి కూడా వియ్యంకుడే. అంటే తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు వియ్యంకులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఖమ్మం అభ్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ పడుతుండగా మెదక్ అభ్యర్థి మాత్రం బీఆర్ఎస్‌ నుంచి పోటీ పడుతున్నారు. ఒకరు నేరుగా వియ్యంకుడు అయితే ఇంకొకరు తమ్ముడి వియ్యంకుడు. అంటే పొంగులేటికి కూడా వియ్యంకుడే. రఘురాంరెడ్డి, వెంకట్రాంరెడ్డిల ముద్దుల వియ్యంకుడిగా మారారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.

Venkatrami Reddy

Venkatrami Reddy

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..