AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers: రైతులందరికీ భారీ శుభవార్త.. నేడు అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేస్కోండి మరి

తెలంగాణలోని రైతులకు శుభవార్త. సోమవారం నుంచి అకౌంట్లలో ప్రభుత్వం నుంచి డబ్బులు జమ కానున్నాయి. ధాన్యంకు క్వింటాకు రూ.500 చొప్పున రైతులకు ఇవ్వనుంది. ఈ రోజు నుంచి రైతుల అకౌంట్లోలో నేరుగా ఇవి పడనున్నాయి. దీంతో రైతులు బ్యాంక్ అకౌంట్‌ను చెక్ చేసుకోవాలి.

Farmers: రైతులందరికీ భారీ శుభవార్త.. నేడు అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేస్కోండి మరి
Farmers Telangana
Venkatrao Lella
|

Updated on: Dec 22, 2025 | 7:38 AM

Share

తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. సన్నరకం వరి ధాన్యం పండించినవారికి క్వింటాకు రూ.500 చొప్పున సోమవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. గత వానాకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు ఈ డబ్బులు పడనున్నాయి. ప్రభుత్వం యాసంగిలో పడించిన సన్నరకం వరి ధాన్యంకు బోనస్ చెల్లించలేదు. దీంతో వానాకాలం పంటకు అయినా చెల్లిస్తారా..? లేదా? అనే ఆందోళన రైతుల్లో గత కొద్దిరోజులుగా నెలకొంది. ప్రభుత్వం ఎట్టకేలకు వానాకాలం పంటకు బోనస్ విడుదల చేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సన్నరకం బియ్యం విక్రయించిన రైతులకు బోనస్ జమ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.649 కోట్లు విడుదల చేసింది. సోమవారం నుంచి వీటీని నేరుగా రైతుల అకౌంట్లోకి విడుదల చేయనున్నారు. గతంలో కొంతమంది రైతులకు డబ్బులు జమ చేశారు. అయితే మధ్యలో పంచాయతీ ఎన్నికలు రావడంతో కోడ్ అడ్డంకి వల్ల ఈ ప్రక్రియను ఆపేశారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగియడం, కోడ్ తొలగిపోవడంతో మిగిలిన రైతులకు సోమవారం నుంచి డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సన్నరకం బియ్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని ఇప్పుడు రేవంత్ సర్కార్ నేరవేర్చుకుంటోంది.

గత యాసంగి సీజన్‌లో సన్నబియ్యం పండించిన రైతులకు బోనస్ ఇవ్వలేదు. ఆ తర్వాత వానాకాలంలో పండించిన బియ్యానికి ఇప్పుడు బోనస్ డబ్బులు ఇస్తున్నారు. గత యాసంగి సీజన్‌కు ఇవ్వకపోడంతో రాబోయే యాసంగి సీజన్‌కు బోనస్ ఇస్తారా..? లేదా? అనే ఆందోళన రైతులను తికమక పెడుతోంది. బోనస్‌పై ముందుగానే ప్రకటన చేస్తే బాగుంటుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సన్నబియ్యం పండించాలంటే పెట్టుబడి ఎక్కువగా అవుతుందని, దిగుబడి కూడా తక్కువగానే వస్తుందని ఆవేదన చెందుతున్నారు. అందుకే యాసంగి సీజన్‌లో కూడా బోనస్ ఇవ్వాలని కోరుతున్నారు. ముందుగానే దీని గురించి ప్రకటన చేయడం ద్వారా తాము పండించారా..? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. మరి ప్రభుత్వం రాబోయే యాసంగి సీజన్‌కు బోనస్ చెల్లిస్తుందా..? లేదా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ యాసంగి సీజన్‌కు కూడా బోనస్ ప్రకటిస్తే రైతులకు మరింత లాభదాయకం అవ్వనుంది.