Telangana: పోలీస్ స్టేషన్ గేటుకు తాళం వేసిన అధికారులు.. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
గతంలో ఈ స్టేషన్‌కు వచ్చిన ఓ ఎస్ఐ వాస్తు బాగాలేందటూ ఉత్తరం, దక్షణం, పడమర, తూర్పు వైపు గేట్లు పెట్టించారు. కాగా ఆ గేట్లు పెట్టిన వారం రోజులకే ఓ వివాదంలో ఆ ఎస్ఐ బదిలీ అయ్యారు. దీంతో రెండు గేట్లు మూసి వేయగా తాజాగా మరో గేటు మూసివేశారు. ఆ పోలీసు స్టేషన్‌కు వాస్తు దోషం పట్టుకుందా…? అయితే పోలీసులు ఏం చేశారు..?
వాణిజ్య కేంద్రంగా పేరున్న ఆ పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్‌కు క్రేజ్ ఉండడంతో ఎస్ఐ పోస్టింగ్స్ డిమాండ్ ఉంటుంది. రాజకీయ నేతల సిఫార్సు లేఖలతో పోస్టింగ్స్ తెప్పించుకుంటారు. ఇక్కడికి వచ్చిన పోలీసు అధికారులు ఏదో ఒక కారణంతో అర్ధాంతరంగా బదిలీ అవుతున్నారు. దీంతో ఆ పోలీస్ స్టేషన్‌కు ఇపుడు ఎస్సైగా రావాలంటే జంకుతున్నారు.
గతంలో ఈ స్టేషన్‌కు వచ్చిన ఓ ఎస్ఐ వాస్తు బాగాలేందటూ ఉత్తరం, దక్షణం, పడమర, తూర్పు వైపు గేట్లు పెట్టించారు. కాగా ఆ గేట్లు పెట్టిన వారం రోజులకే ఓ వివాదంలో ఆ ఎస్ఐ బదిలీ అయ్యారు. దీంతో రెండు గేట్లు మూసి వేయగా తాజాగా మరో గేటు మూసివేశారు. ఆ పోలీసు స్టేషన్‌కు వాస్తు దోషం పట్టుకుందా…? అయితే పోలీసులు ఏం చేశారు..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీస్ చదవాల్సిందే..
వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడకు వాణిజ్య కేంద్రంగా పేరుంది. ఇక్కడి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహించేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక్కడ పని చేసేందుకు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎస్‌ఐలు పోటీ పడుతుంటారు. దీంతో అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై ఉన్న ఈ పోలీస్ స్టేషన్‌కు క్రేజ్ ఏర్పడింది. పోటీపడి రాజకీయ నేతల సిఫార్సు లేఖలతో పోస్టింగ్స్ తెప్పించుకుంటారు. మంచి పోలీస్ స్టేషన్ అనుకొని డ్యూటీలో చేరిన ఎస్‌ఐలు కొన్ని నెలలకే అనూహ్యంగా వివాదాలలో చిక్కుకుంటున్నారు.
గతంలో ప్రస్తుత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ ను 2013లో పాత వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి, చైర్మన్లు ఉన్న బిల్డింగ్ లోకి మార్చారు. రూరల్ పోలీస్ స్టేషన్ ను ఇక్కడికి మార్చిన తర్వాత 9మంది ఎస్ఐలు పనిచేశారు. వీరిలో కొందరు ఎస్ఐలు వివిధ వివాదాల్లో బదిలీపై వెళ్లారు. రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ ఎస్ఐ వాస్తు బాగాలేందటూ ఉత్తరం, దక్షణం, పడమర, తూర్పు వైపు గేట్లు పెట్టించారు. కాగా ఆ గేట్లు పెట్టిన వారం రోజులకే ఓ వివాదంలో ఆ ఎస్ఐ బదిలీ అయ్యారు.
దీంతో రెండు గేట్లు మూసి వేయగా తాజాగా పోలీసులు మరో గేటును మూసివేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలతో పోలీస్ శాఖలో గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే పోలీసులకు ఎప్పుడు ఏమవుతుందోనన్న ఆందోళన పట్టుకుంది. స్టేషన్ గేట్లను మూసి వేయడంతో అయినా స్టేషన్ కు పట్టిన వాస్తు దోషం ఇప్పుడైనా తొలగుతుందో లేదో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..