NEET Counselling 2024: స్థానికత వ్యవహారంపై తెలంగాణ ‘నీట్’ అభ్యర్ధులకు ఊరట.. ధర్మాసనం తీర్పు ఇదే!

నీట్ కౌన్సెలింగ్ లో స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. స్థానిక విషయమై హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు 'నీట్' కౌన్సెలింగ్ కి హాజరయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కౌన్సెలింగ్ సమయం అతి తక్కువగా మార్కులు ఉండటంతో ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు చెప్పింది. పిటిషన్‌‌పై..

NEET Counselling 2024: స్థానికత వ్యవహారంపై తెలంగాణ 'నీట్' అభ్యర్ధులకు ఊరట.. ధర్మాసనం తీర్పు ఇదే!
Supreme Court
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 20, 2024 | 1:52 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 120: నీట్ కౌన్సెలింగ్ లో స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. స్థానిక విషయమై హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు ‘నీట్’ కౌన్సెలింగ్ కి హాజరయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కౌన్సెలింగ్ సమయం అతి తక్కువగా మార్కులు ఉండటంతో ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు చెప్పింది. పిటిషన్‌‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపారు. విచారణ సందర్భంగా ఈ ఒక్కసారికి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి చెప్పారు. స్థానికతను నిర్థారిస్తూ నాలుగు రాజ్యాంగ ధర్మాసనం తీర్పులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అన్ని తీర్పులు స్పష్టంగా ఉన్నా మళ్ళీ కోర్టును ఆశ్రయించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో విద్యార్థుల తరపు న్యాయవాది విభేదించారు. కేవలం రెండు, మూడు సంవత్సరాలు చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికత దూరం చేయకూడదని విద్యార్థుల తరపు న్యాయవాది తెలిపారు. కేసు మెరిట్స్‌లోకి వెళ్లే సమయం ఇప్పుడు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని సీజేఐ కోరారు.

విద్యార్థుల భవిష్యత్, ప్రస్తుత సమయాభావం కారణంగా ఈ ఒక్కసారికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినందున హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్ కి హారయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చంది. దీంతో గత కొన్ని వారాలుగా కోర్టులో నానుతున్న స్థానకత వ్యవహారం కొలిక్కివచ్చినట్లైంది.

కాగా తెలంగాణలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు రాష్ట్ర వైద్య, దంత వైద్య కాలేజీల్లో అవకాశం కల్పించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్‌ 5న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం విచారించింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాలు అంతకంత ఆలస్యం అవుతుండటంతో.. దీనిపై త్వరగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరింది. అందుకు సమ్మతి తెలిపిన సీజేఐ త్వరతి గతిన పిటిసన్‌ను విచారించి పరిష్కరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.