AP Dussehra Holidays 2024: స్కూల్‌ పిల్లలకు భారీగా దసరా సెలవులు.. ఎప్పట్నుంచంటే?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు దసరా సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఊర్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా సందర్బంగా ప్రధాన నగరాలకు వెళ్లేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. ప్రతీయేట దసరా వచ్చిందంటే స్కూల్స్‌, కాలేజీలకు భారీగానే సెలవులు వస్తాయి..

AP Dussehra Holidays 2024: స్కూల్‌ పిల్లలకు భారీగా దసరా సెలవులు.. ఎప్పట్నుంచంటే?
Dussehra Holidays
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 20, 2024 | 8:15 AM

అమరావతి, సెప్టెంబర్‌ 20: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు దసరా సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఊర్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా సందర్బంగా ప్రధాన నగరాలకు వెళ్లేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. ప్రతీయేట దసరా వచ్చిందంటే స్కూల్స్‌, కాలేజీలకు భారీగానే సెలవులు వస్తాయి. ఈ ఏడాది రాష్ట్రంలోని పాఠశాలలకు 10 రోజులు సెలవులు వచ్చాయి. విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 13వ తేదీతో సెలవులు ముగుస్తాయి. తిరిగి పాఠశాలలు అక్టోబర్ 14వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సెలవు వస్తుంది. అక్టోబర్‌ 3వ తేదీన వర్కింగ్‌ డే. అక్టోబర్‌ 3వ తేదీన కూడా సర్కార్ సెలవు ఇస్తే.. 12 రోజుల పాటు సెలవులు వస్తాయి. సెలవుల నేపథ్యంలో అక్టోబర్‌ నెలలో కేవలం 17 రోజులు మాత్రమే తరగతులు జరగనున్నాయి. అయితే దసరా సెలవులపై ఏపీ సర్కార్ ఇంకా అధికారిక ప్రకటన వెలువరించ లేదు. ప్రకటన వస్తేగానీ మొత్తం ఎన్ని రోజులు సెలవులు వస్తాయనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు అక్టోబ‌ర్ నెల‌లోనే 31వ తేదీన దీపావళి ఉండటంతో ఆ రోజు రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు వస్తుంది. ఇలా మొత్తంగా చూస్తే అక్టోబర్‌ నెలలో మొత్తం 13 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఇక క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22 నుంచి 29 వరకు ఇవ్వనున్నారు. సంకాంత్రి సెలవులు 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులపై ప్రకటన వెలువరించింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలకు వరుసగా 13 రోజులు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీన తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ ప్రకటనలో వివరించింది. ఆ తర్వాత డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు క్రిస్మస్ సెల‌వులు, జ‌న‌వ‌రి 13 నుంచి 17వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు వస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!