Hyderabad: ఆడవేషంలో గజ దొంగ హల్‌చల్‌.. కన్నేశాడో ఆనవాళ్లు కూడా దొరకవ్‌!

కరుడు గట్టిన ఓ గజ దొంగ తెలుగు రాష్ట్రాల్లో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టసాగాడు. ఇప్పటికే పలు పోలీస్‌ స్టేషన్లలో 60కిపైగా కేసులు నమోదయ్యాయి. పోలీసులకు దొరక్కుండా.. ఒక్క ఆనవాలు కూడా మిగల్చకుండా చాకచక్యంగా చోరీలు చేయడంలో అతడు సిద్ధహస్తుడు. తాళం వేసిన ఇల్లే ఇతగాడి లక్ష్యం. అయితే చోరీలు చేయడంతో ఈ దొంగ గారి స్టైలే వేరు. మాస్క్‌లు, విగ్గులు ధరించి ఆడ వేషంతో చోరీలు చేస్తూ..

Hyderabad: ఆడవేషంలో గజ దొంగ హల్‌చల్‌.. కన్నేశాడో ఆనవాళ్లు కూడా దొరకవ్‌!
robberies in female disguise
Follow us

|

Updated on: Sep 19, 2024 | 11:06 AM

రాజేంద్రనగర్, సెప్టెంబర్‌ 19: కరుడు గట్టిన ఓ గజ దొంగ తెలుగు రాష్ట్రాల్లో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టసాగాడు. ఇప్పటికే పలు పోలీస్‌ స్టేషన్లలో 60కిపైగా కేసులు నమోదయ్యాయి. పోలీసులకు దొరక్కుండా.. ఒక్క ఆనవాలు కూడా మిగల్చకుండా చాకచక్యంగా చోరీలు చేయడంలో అతడు సిద్ధహస్తుడు. తాళం వేసిన ఇల్లే ఇతగాడి లక్ష్యం. అయితే చోరీలు చేయడంతో ఈ దొంగ గారి స్టైలే వేరు. మాస్క్‌లు, విగ్గులు ధరించి ఆడ వేషంతో చోరీలు చేస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అయితే అనూహ్యంగా పోలీసులకు చిక్కడంతో ఇతగాడి బండారం బయటపడింది. రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో సెప్టెంబర్‌ 4వ తేదీన ఓ ఇంట్లో 60 తులాల బంగారం చోరీకి గురైంది. అదే ఠాణా పరిధిలో తాళం వేసిన మరో ఇంట్లోనూ చోరీ జరిగింది. దీనిపై దృష్టి సారించిన సీసీఎస్, రాజేంద్రనగర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుడి కదలికలపై గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలో భోజగుట్టకు చెందిన గుంజపోగు సుధాకర్‌ (33)ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. రాజేంద్రనగర్‌తో పాటు పేట్‌బషీర్‌బాగ్‌లో 2, రాయదుర్గంలో 1.. ఇలా మొత్తం 5 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీల్లో సుధాకర్‌తోపాటు అతడికి సహకరించిన బండారి శాంసన్, షాన్‌దేవ్‌ సాలౌంకె, అమర్‌జీత్‌సింగ్, గుంజపోగు సురేష్‌లను అరెస్టు చేశారు.

మారు వేషాలు.. నకిలీ పేర్లు

నిందితుడు గుంజపోగు సుధాకర్‌ అలియాస్‌ సాయి అలియాస్‌ సల్మాన్‌ అలియాస్‌ కాకా అలియాస్‌ డేంజర్‌ అలియాస్‌ ఆంటోనీ.. ఇలా ఒక్కోచోట ఒక్కోపేరుతో చలామణి అవుతూ తన గుర్తింపు బయటకు రాకుండా జాగ్రత్త పడేవాడు. ఓ ప్రాంతాన్ని ఎంచుకుని తాళం వేసిన ఇళ్లను గుర్తించేవారు. అనంతరం తన ముఠాతో కలిసి స్కెచ్‌ వేసేవాడు. సీసీ కెమెరాల కంటపడకుండా బైకులపై తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తాడు. ఒక్కోసారి బైక్‌ను ఓ చోట పార్క్‌ చేసి, కాలినడకన ఆయా ప్రాంతాల్లో రెక్కీ వేసేవాడు. దొంగతనానికి ఓ డేట్‌ ఫిక్స్‌ చేసుకుని, విగ్గులు పెట్టుకుని ఆడ వేషంలో స్కెచ్‌ వేసిన ఇంటికి వచ్చి, పని ముగిశాక చోరీ చేసిన వాహనంపై ఉడాయిస్తాడు.

ఇవి కూడా చదవండి

అయితే ఇప్పటికే పలుమార్లు దొంగతనాలు చేసి పట్టుబడిన సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేజి జైలుకు తరలించారు. జైలులో బండారి శాంసన్, షాన్‌దేవ్‌ సాలౌంకె, అమర్‌జీత్‌సింగ్‌ అనే ముగ్గురు దొంగలతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాకి వీరితో ముఠా కట్టి వరుస చోరీలకు పాల్పడుతున్నాడు. వీరు చోరీ చేసిన సొత్తును సుధాకర్‌ సోదరుడు సురేష్‌కు అందజేస్తారు. సురేష్‌కు భోజగుట్టలో సొంత ఇళ్లు ఉంది. అతడు చోరీ చేసిన బంగారాన్ని విక్రయించి వీరికి డబ్బులు అందజేస్తుంటాడు. ఒకవేళ పోలీసులకు చిక్కితే బెయిల్‌పై బయటకు వచ్చేందుకు కొంత సొత్తును ముందే భద్రపరుస్తాడు. అరెస్ట్‌ అయిన వెంటనే ముందే పురమాయించిన లాయర్‌ సాయంతో బెయిల్‌పై బయటకు వచ్చి, ఎప్పటి మాదిరిగానే చోరీలు చేస్తుంటాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.