IRCTC: తక్కువ బడ్జెట్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా.? మీకోసమే ఈ స్పెషల్ ప్యాకేజీ
ఆక్టోబర్ నెలలో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. అక్టోబర్ 1, 8, 15, 22, 29 లేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ముందస్తు రిజర్వేషన్‌లు ప్రారంభమయ్యాయి. ఇంతకీ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ బడ్జెట్‌లో టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్. దేశంలోని అన్ని ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తున్న ఐఆర్‌సీటీసీ తాజాగా ‘డివైన్ కర్ణాటక’ పేరుతో ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఈ టూర్‌ను అందిస్తున్నారు. 5 రాత్రులు 6 రోజులు ఈ టూర్ ఉంటుంది.
ఆక్టోబర్ నెలలో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. అక్టోబర్ 1, 8, 15, 22, 29 లేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ముందస్తు రిజర్వేషన్‌లు ప్రారంభమయ్యాయి. ఇంతకీ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయాణం ఇలా సాగుతుంది..
* తొలిరోజు ఉదయం 6:05 గంటలకు కాచిగూడ- మంగళూర్ సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం: 12789) ఎక్కాల్సి ఉంటుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
* రెండోరోజు ఉదయం 9.30 గంటలకు మంగళూరు చేరుకుంటారు. అక్కడినుంచి ఉడిపికి చేరుకొని హోటల్‌లో ఫ్రెషప్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ ఆలయం, మాల్పే బీచ్ సందర్శన ఉంటుంది. రాత్రి ఉడిపిలో బస ఉంటుంది.
* ఇక మూడో రోజు ఉదయం శృంగేరీ చేరుకుంటారు. అక్కడ శారదాంబ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం మంగళూరు వెళ్తారు. రాత్రి అక్కడే బస ఉంటుంది.
* నాలుగో రోజు ఉదయం ధర్మస్థల చేరుకుంటారు. అనంతరం మంజునాథ స్వామి ఆలయాన్ని, కుక్కే సుబ్రమణ్య ఆలయానికి దర్శించుకొని. సాయంత్రం తిరిగి మంగళూరుకు పయనమవుతారు. రాత్రి మంగళూరులో స్టే చేస్తారు.
* ఇక 5వ రోజు మంగళదేవి ఆలయం, కదిరి మంజునాథ ఆలయం దర్శించుకుంటారు. సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి గోకర్నాథ దేవాలయం దర్శన ఉంటుంది. ఆ తర్వాత మంగళూరు రైల్వేస్టేషన్ చేరుకుని, రాత్రి 8 గంటలకు (ట్రైన్ నం: 12790) రైలు ఎక్కుతారు.
* ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ఛార్జీలు ఎలా ఉంటాయంటే..
ఛార్జీల విషయానికొస్తే.. రూమ్ సింగిల్ షేరింగ్ విషయానికొస్తే రూ.38,100 కాగా, ట్విన్ షేరింగ్‌కు రూ. 22,450, ట్రిపుల్ షేరింగ్ విషయానికొస్తే రూ. 18150గా నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్ రూ. 11430, విత్ అవుట్ బెడ్ అయితే రూ. 9,890గా ఉంది.స్లీపర్ బెర్త్‌కు థర్డ్ ఏసీకి ప్రత్యేకంగా ఛార్జీలను నిర్ణయించారు. ఎంచుకున్న ప్యాకేజీ ఆధారంగా వసతి సదుపాయాలు ఉంటాయి. పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..