Telangana Tourism: వీకెండ్‌కి ఇలా చిల్‌ అవ్వండి.. రూ. 800కే టూర్ ప్యాకేజీ

ఇందులో భాగంగానే తెలంగాణ టూరిజం ఆకర్షణీయమైన టూర్ ప్లాన్స్‌ను అందిస్తోంది. కేవలం ఒక్కరోజులోనే పూర్తయ్యేలా నాగార్జున సాగర్‌ చూసే అవకాశాన్ని కలిపిస్తోంది. శని, ఆది వారాల్లో అందుబాటులో ఉండే ఈ ప్యాకేజీలో సాగర్‌తో పాటు పలు ప్రాంతాలను సందర్శించవచ్చు. హైదరాబాద్‌ నుంచి ఉదయం బయలు దేరి మళ్లీ రాత్రి వరకు ఇంటికి చేరుకోవాలనుకునే వారికి ఈ టూర్‌ ప్యాకేజీ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు..

Telangana Tourism: వీకెండ్‌కి ఇలా చిల్‌ అవ్వండి.. రూ. 800కే టూర్ ప్యాకేజీ
Telangana Tourism
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 20, 2024 | 7:50 AM

ఒకప్పుడు ఏదైనా టూర్‌ ప్లాన్‌ చేయాలంటే ఒక వారం ముందు నుంచి ప్రణాళికలు వేసుకొని. ఆఫీసులకు సెలవులు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం పలు సంస్థలు అందిస్తోన్న టూరిజం ప్యాకేజీలతో అప్పటికప్పుడు టూర్‌ ప్లాన్స్‌ చేసుకునే వెసులుబాటు లభించింది. సెలవులు పెట్టాల్సిన అవసరం లేకుండానే వారాంతాల్లో ఎంచక్కా టూర్స్‌ ప్లాన్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.

ఇందులో భాగంగానే తెలంగాణ టూరిజం ఆకర్షణీయమైన టూర్ ప్లాన్స్‌ను అందిస్తోంది. కేవలం ఒక్కరోజులోనే పూర్తయ్యేలా నాగార్జున సాగర్‌ చూసే అవకాశాన్ని కలిపిస్తోంది. శని, ఆది వారాల్లో అందుబాటులో ఉండే ఈ ప్యాకేజీలో సాగర్‌తో పాటు పలు ప్రాంతాలను సందర్శించవచ్చు. హైదరాబాద్‌ నుంచి ఉదయం బయలు దేరి మళ్లీ రాత్రి వరకు ఇంటికి చేరుకోవాలనుకునే వారికి ఈ టూర్‌ ప్యాకేజీ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు..

ప్రయాణం ఇలా సాగుతుంది..

* ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌లోని పర్యాటక భవన్ నుంచి బస్సు బయలుదేరుతుంది.

* ఉదయం 8 గంటలకు బస్సుల బషీర్‌బాగ్ చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రయాణం మొదలవుతుంది.

* 11.30 గంటలకు బస్సు నాగార్జున సాగర్‌కు చేరుకుంటుంది.

* అనంతరం 11.40 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బుద్ధవనం ప్రాజెక్ట్ సందర్శన ఉంటుంది.

* ఇక ఒంటి గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం.

* తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నాగార్జునకొండకు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్క‌డ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు. బోటింగ్​ కూడా చేయొచ్చు.

* సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్‌ సందర్శన ఉంటుంది.

* సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ఛార్జీలు..

ఛార్జీల విషయానికొస్తే.. పెద్దలకు రూ. 800, చిన్నారులకు రూ. 640గా నిర్ణయించారు. నాన్‌ ఏసీ బస్సులో ప్రయాణం ఉంటుంది. బోటింగ్‌, ఎంట్రీ, భోజనం వంటివి టూర్‌ ప్యాకేజీలో ఉండవు.. ప్రయాణికులే వీటిని భరించాలి. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?