AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara Vacation: దసరా సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా.. అక్టోబర్‌లో ఈ ప్రదేశాల టూర్ బెస్ట్ ఎంపిక

అక్టోబరు నెలలో భారత దేశంలో చాలా పర్యాటక ప్రదేశాల అందం మరింత పెరుగుతూ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. శీతాకాలానికి ముందు దసరా సెలవులలో విహారయాత్రకు వేల్ల్లడానికి ప్లాన్ చేస్తున్నారా.. ఈ పర్యటన ద్వారా అత్యుత్తమ జ్ఞాపకాలను దాచుకునే ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. అక్టోబర్ నెలలో ట్రావెల్ డైరీ కోసం ఎంచుకునే బెస్ట్ గమ్యస్థానం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..

Dasara Vacation: దసరా సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా.. అక్టోబర్‌లో ఈ ప్రదేశాల టూర్ బెస్ట్ ఎంపిక
Pre Winter Vacation Trip
Surya Kala
|

Updated on: Sep 20, 2024 | 10:54 AM

Share

భారతదేశంలో వివిధ రకాల సంస్కృతులు, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, దుస్తులు భిన్న రకలున్నాయి. దేశ విదేశాల్లోని నలుమూల నుంచి పర్యాటకులు భారత దేశంలోని వివిధ ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడతారు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే భారత్ లో ప్రతి సీజన్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ కారణంగా దేశంలోని పర్యాటక ప్రదేశాలలో ప్రయాణికుల రద్దీ ఉంటుంది. వర్షం పడిన తర్వాత పర్వతాల అందాలు పెరిగి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. అయితే చలి ప్రదేశాలకు వెళ్లడం కొంత ఇబ్బందే.. అందుకే రుతుపవనాలు వెళ్లిన తర్వాత.. శీతాకాలం రాక ముందే కొన్ని ప్రదేశాలను సందర్శించడం ఉత్తమమని చెబుతారు.

అక్టోబరు నెలలో భారత దేశంలో చాలా పర్యాటక ప్రదేశాల అందం మరింత పెరుగుతూ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. శీతాకాలానికి ముందు దసరా సెలవులలో విహారయాత్రకు వేల్ల్లడానికి ప్లాన్ చేస్తున్నారా.. ఈ పర్యటన ద్వారా అత్యుత్తమ జ్ఞాపకాలను దాచుకునే ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. అక్టోబర్ నెలలో ట్రావెల్ డైరీ కోసం ఎంచుకునే బెస్ట్ గమ్యస్థానం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..

జమ్మూ కశ్మీర్

కశ్మీర్ అందాన్ని అలనాటి కవుల నుంచి నేటి సినిమా కవులు కూడా వివిధ రకాలుగా వర్ణించారు. ఇది భారతదేశంలో అందమైన ప్రదేశం. ఒక్కసారి కాశ్మీర్ ని సందర్శించిన తర్వాత, తిరిగి రావాలని అనిపించదు. అందువల్ల ఇది భారతదేశానికి అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా పరిగణించబడుతుంది. దాల్ సరస్సు అందం, ఇతర ప్రదేశాలను సందర్శించడం వలన కలిగే వినోదం భిన్నంగా ఉంటుంది. అక్టోబర్‌లో ఈ ప్రదేశం మరింత అందంగా కనిపిస్తుంది. కనుక దసరా సెలవుల్లో జమ్మూ కశ్మీర్ పర్యటనకు బెస్ట్ ప్లేస్.

ఇవి కూడా చదవండి

రిషికేశ్, ఉత్తరాఖండ్

గంగా నది ఒడ్డున ఉన్న రిషికేశ్‌ను యోగా సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి . అయినప్పటికీ రుషికేష్ పర్వతాల మధ్య ఉన్న ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ అంటే NCR నుంచి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం అయిన రిషికేశ్‌కి ట్రిప్ ప్లాన్ చేయాలి. వర్షాకాలం తర్వాత ఈ ప్రదేశం ఒక రకమైన భూతల స్వర్గంగా మారుతుంది. ఇక్కడ రోమింగ్‌తో పాటు రివర్‌ రాఫ్టింగ్‌ వంటి అనేక కార్యకలాపాలు కూడా చేయవచ్చు.

హంపి, కర్ణాటక

దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా పిలుస్తారు. ఇక్కడ రాయల కాలం నాడు నిర్మించిన పురాతన భవనాల నిర్మాణ సౌదర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. సెప్టెంబర్-అక్టోబర్‌లో దక్షిణ భారతదేశంలోని ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఉత్తమం. హంపిలో ఉన్న చారిత్రక కట్టడాలు చరిత్రను గొప్పగా చెబుతాయి.

మున్నార్, కేరళ

భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాలలో కేరళ ఒకటి. టీ తోటలు, బీచ్‌లు , పచ్చదనంతో నిండి ఉన్న కేరళ వర్షాకాలంలో స్వర్గంలా అనిపిస్తుంది. ఆకు పచ్చ చెట్లతో ప్రకృతి దుప్పటి పర్వతాలను కప్పివేస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ పర్యటనకు మరింత థ్రిల్‌ని ఇస్తుంది. కేరళలో అత్యంత ప్రసిద్ధి చెందిన మున్నార్‌ను సందర్శించడం వేరే విషయం. ఇక్కడ హౌస్‌బోట్‌లో సవాలీని సందర్శించడానికి, బీచ్‌లోని ప్రశాంతత, ప్రకృతి అందాలను చూడటానికి అక్టోబర్ నెల ఉత్తమ సమయం.

మరిన్ని  లైఫ్ స్టైల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)