కేరళను వణికిస్తున్న మంకీపాక్స్‌.. నిఫా వైరస్‌‌లు.. ఒకే వ్యక్తిలో రెండు వైరస్‌లు గుర్తింపు.. సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలెర్ట్‌

యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్‌ వైరస్‌ సోకినట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఆయన మంకీపాక్స్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపింది. మంజేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని శాంపిల్స్‌ను కోజికోడ్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. పాజిటివ్‌గా తేలింది. దాంతో.. దేశంలో రెండో మంకీపాక్స్‌ కేసు రికార్డ్‌ అయింది. అలెర్ట్‌ అయిన కేరళ అధికారులు.. దుబాయ్‌ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎవరెవర్ని కలిశారో వారిని ట్రేస్‌ చేసే పనిలో పడ్డారు.

కేరళను వణికిస్తున్న మంకీపాక్స్‌.. నిఫా వైరస్‌‌లు.. ఒకే వ్యక్తిలో రెండు వైరస్‌లు గుర్తింపు.. సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలెర్ట్‌
Mpox Cases In Kerala
Follow us

|

Updated on: Sep 20, 2024 | 7:09 AM

కేరళను వైరస్‌లు వణికిస్తున్నాయి. ఇప్పటికే.. మంకీ పాక్స్‌ కేరళను షేక్‌ చేస్తుండగా.. నిఫా వైరస్‌ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. అంతేకాదు.. ఒకే వ్యక్తిలో అటు నిఫా.. ఇటు మంకీపాక్స్‌ లక్షణాలు బయటపడుతుండడం కేరళను మరింత కుదిపేస్తోంది. మంకీ పాక్స్‌.. నిఫా వైరస్‌ వ్యాప్తితో కేరళతోపాటు సరిహద్దు రాష్ట్రాలు అలెర్ట్‌ అయ్యాయి. తమిళనాడు- కేరళ బోర్డర్‌లో హైఅలెర్ట్‌ ప్రకటించి తనిఖీలు ముమ్మరం చేయడం కలకలం రేపుతోంది.

యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తి

కరోనా తగ్గిందిలే అనుకునే లోపే.. వరుస వైరస్‌లు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. ప్రస్తుతం వరల్డ్‌ వైడ్‌గా పలు దేశాలను వణికిస్తోన్న నిఫా వైరస్‌, మంకీపాక్స్‌ మనదేశంలోనూ హడలెత్తిస్తున్నాయి. ప్రధానంగా.. కేరళను ఆ రెండు వైరస్‌లు కలవరపెడుతున్నాయి. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్‌ వైరస్‌ సోకినట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఆయన మంకీపాక్స్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపింది. మంజేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని శాంపిల్స్‌ను కోజికోడ్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. పాజిటివ్‌గా తేలింది. దాంతో.. దేశంలో రెండో మంకీపాక్స్‌ కేసు రికార్డ్‌ అయింది. అలెర్ట్‌ అయిన కేరళ అధికారులు.. దుబాయ్‌ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎవరెవర్ని కలిశారో వారిని ట్రేస్‌ చేసే పనిలో పడ్డారు. 16మందిని గుర్తించి ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. ఈనెల 9న తొలి మంకీపాక్స్‌ కేసు నమోదు అయింది.

మళ్లీ తెరపైకి నిఫా వైరస్‌

ఒకవైపు కేరళను మంకీపాక్స్‌ వణికిస్తుండగా.. ఇప్పుడు నిఫా వైరస్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా.. ఒక వ్యక్తికి నిఫా వైరస్ నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. అతనితో కలిసి ఉన్న 268 మందిని ఐసొలేషన్‌లో ఉంచారు కేరళ అధికారులు. వారిలో 81 మంది హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌, 177మంది ప్రైమరీ కాంటాక్ట్‌ ప్రజలు, 90మంది సెకండరీ కాంటాక్ట్‌ ప్రజలుగా గుర్తించారు. అయితే.. ప్రైమరీ కాంటాక్ట్‌ లిస్టులోని 134మందిని వైద్యులు హైరిస్క్‌ కేటగిరిలో ఉంచారు. ఇద్దరికి నిఫా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో స్థానిక మంజేరి మెడికల్‌ కాలేజ్‌కు తరలించారు. వీళ్లిద్దరితోపాటు మొత్తం ఎనిమిది మందికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. మరో 21మందిని పేరింతల్‌మన్నా ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలెర్ట్

ఇదిలావుంటే.. కేరళలోని మలప్పురంలో నిఫా వైరస్‌తోపాటు.. మంకీ పాక్స్‌ లక్షణాలున్న వ్యక్తులను గుర్తిస్తున్నారు అధికారులు. దానిలో భాగంగా.. తమిళనాడు- కేరళ సరిహద్దు జిల్లాల్లో అలెర్ట్ ప్రకటించారు. కేరళ నుంచి కన్యాకుమారి ద్వారా తమిళనాడుకు వస్తున్న వాహనాలపై నిఘా పెంచారు. పూర్తి వైద్య పరీక్షల తర్వాతే కేరళ నుంచి తమిళనాడులోనికి ప్రజల్ని అనుమతిసతున్నారు. 24 గంటలపాటు తనిఖీలు నిర్వహించాలని, వైరస్ లక్షణాలున్న వారిని గుర్తించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాంతో.. నాగర్‌కోయిల్‌లో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే.. సరిహద్దు జిల్లాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు.

తొలిసారి నిఫా వైరస్‌ను 1999లో గుర్తింపు

నిఫా వైరస్‌ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుందని ఇప్పటికే అధికారికంగా తేలింది. తొలిసారి నిఫా వైరస్‌ను 1999లో గుర్తించారు. గబ్బిలాలు తిన్న పండ్లను తీసుకోవడం ద్వారా నిఫా వైరస్‌ మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. ఇక.. వైరస్‌ల వ్యాప్తితో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. అన్ని దేశాలను అలెర్ట్‌ చేసింది. మరోసారి లాక్‌డౌన్‌ లాంటి పరిస్థితులు రాకుండా చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మొత్తంగా.. ఇటు మంకీపాక్స్‌.. అటు నిఫా వైరస్‌ వ్యాప్తితో కేరళ గజగజలాడుతోంది. వరుస కేసుల నమోదుతో భయపడిపోతోంది. అందులోనూ.. ఒకే వ్యక్తిలో రెండు రకాల వైరస్‌ల లక్షణాలు బయటపడుతుండడం మరింత భయాందోళనకు గురి చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..