Canara Bank: కెనరా బ్యాంకులో 3 వేల కొలువులు.. ఇంటర్ మార్కులతో ఎంపిక
బెంగళూరులోని కెనరా బ్యాంక్‌లోని హ్యూమన్ రిసోర్సెస్ విభాగం.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు బ్రాంచుల్లో అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు..
బెంగళూరులోని కెనరా బ్యాంక్‌లోని హ్యూమన్ రిసోర్సెస్ విభాగం.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు బ్రాంచుల్లో అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 21 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 4వ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 3,000 అప్రెంటిస్‌షిప్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎస్సీ కేటగిరీలో 479 ఖాళీలు, ఎస్టీ కేటగిరీలో 184 ఖాళీలు, ఓబీసీ కేటగిరీలో 740 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 295 ఖాళీలు, యూఆర్ కేటగిరీలో 1302 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 200, తెలంగాణలో 120, కర్ణాటకలో 600, తమిళనాడులో 350 వరకు ఉన్నాయి.
ఆసక్తి కలిగిన వారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీలో అర్హత కలిగి ఉండాలి. సెప్టెంబర్ 1, 2024 నాటికి అభ్యర్ధుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో ప్రతి నెలా స్టైపెండ్ కింద నెలకు రూ.15,000 చొప్పున చెల్లిస్తారు.12వ తరగతి (హెచ్‌ఎస్‌సీ/ 10+2)/ డిప్లొమా మార్కులు, రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.500 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అక్టోబరు 3 నుంచి తెలంగాణ ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ఆధ్వర్యంలో పది, ఇంటర్ పరీక్షలు అక్టోబరు 3వ తేదీ నుంచి 9 వరకు జరుగనున్నాయి. ఈ మేరకు టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబరు 16 నుంచి 23 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు పూర్తిస్థాయి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు.