UPSC Civils Mains 2024: రేపటి నుంచి యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు.. 30 నిమిషాల ముందే గేట్లు క్లోజ్‌

వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్‌ పరీక్షలకు దేశ వ్యాప్తంగా ప్రతీయేట లక్షలాది మంది యువత పోటీ పడుతుంటారు. సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2024 ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే పూర్తికాగా.. రేపట్నుంచి మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా యూపీఎస్సీ జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిగా..

UPSC Civils Mains 2024: రేపటి నుంచి యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు.. 30 నిమిషాల ముందే గేట్లు క్లోజ్‌
UPSC Civils Mains
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 19, 2024 | 12:37 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19: వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్‌ పరీక్షలకు దేశ వ్యాప్తంగా ప్రతీయేట లక్షలాది మంది యువత పోటీ పడుతుంటారు. సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2024 ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే పూర్తికాగా.. రేపట్నుంచి మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా యూపీఎస్సీ జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిగా.. ఫలితాలు జులై 1న విడుదలయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్‌ 20, 21, 22, 28, 29 తేదీల్లో జరుగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కో సెషన్‌ పరీక్ష మూడు గంటల పాటు జరుగుతుంది. మెయిన్స్‌ పరీక్షలు మొత్తం ఐదు రోజుల పాటు కొనసాగుతాయి.

ఈ తేదీల్లో దేశవ్యాప్తంగా 24 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో మెయిన్స్‌ పరీక్షల కోసం 6 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 708 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందే అభ్యర్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని అధికారులు సూచించారు. మెయిన్స్ అనంతరం ప్రతిభకనబరచిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. మెయిన్స్ అనంతరం అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. మెయిన్స్‌, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా సర్వీసులను కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ 2024 పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే.. ఏ రోజున ఏయే పరీక్షలు జరుగుతాయంటే

  • సెప్టెంబర్‌ 20, 2024న ఉదయం పేపర్‌-1 ఎస్సే ఉంటుంది
  • సెప్టెంబర్‌ 21, 2024న ఉదయం పేపర్‌-2 జనరల్‌ స్టడీస్‌-1 పరీక్ష, మధ్యాహ్నం పేపర్‌-3 జనరల్‌ స్టడీస్‌-2 పరీక్ష ఉంటుంది
  • సెప్టెంబర్‌ 22, 2024న ఉదయం పేపర్‌-4 జనరల్‌ స్టడీస్‌-3 పరీక్ష పరీక్ష, మధ్యాహ్నం పేపర్‌-5 జనరల్‌ స్టడీస్‌-4 పరీక్ష ఉంటుంది
  • సెప్టెంబర్‌ 28, 2024న ఉదయం పేపర్‌-ఎ (ఇండియన్‌ లాంగ్వేజ్‌) పరీక్ష, మధ్యాహ్నం పేపర్‌-బి (ఇంగ్లిష్‌) పరీక్ష ఉంటుంది
  • సెప్టెంబర్‌ 29, 2024న ఉదయం పేపర్‌-6 (ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌-1) పరీక్ష, మధ్యాహ్నం పేపర్‌-7 (ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌-2) పరీక్ష ఉంటుంది

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA