Prakasam Barrage: 8 రోజులుగా ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు.. విజయవంతంగా తొలగించిన ఇంజినీర్లు

ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న భారీ బోట్లను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ విజయవంతమైంది. వీటిల్లో ఒక బోటు విజయవంతంగా తొలగించారు. దాదాపు 40 టన్నుల బరువున్న భారీ బోటును ఒడ్డుకు బెకెం ఇన్ఫ్రా సంస్థ ఇంజినీర్లు ఒడ్డుకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో బెకెం ఇన్ఫ్రా ఇంజినీర్లు భారీ బోటును మంగళవారం (సెప్టెంబర్ 17) రాత్రి ఒడ్డుకు చేర్చారు. ఎనిమిది రోజులుగా గేట్ల దగ్గరే బోట్ల..

Prakasam Barrage: 8 రోజులుగా ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు.. విజయవంతంగా తొలగించిన ఇంజినీర్లు
Prakasam Barrage
Follow us

|

Updated on: Sep 18, 2024 | 8:56 AM

విజయవాడ, సెప్టెంబర్ 18: ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న భారీ బోట్లను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ విజయవంతమైంది. వీటిల్లో ఒక బోటు విజయవంతంగా తొలగించారు. దాదాపు 40 టన్నుల బరువున్న భారీ బోటును ఒడ్డుకు బెకెం ఇన్ఫ్రా సంస్థ ఇంజినీర్లు ఒడ్డుకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో బెకెం ఇన్ఫ్రా ఇంజినీర్లు భారీ బోటును మంగళవారం (సెప్టెంబర్ 17) రాత్రి ఒడ్డుకు చేర్చారు. ఎనిమిది రోజులుగా గేట్ల దగ్గరే బోట్ల తొలగింపులో ప్లాన్ ఏ ఫెయిల్‌ అయింది. ప్లాన్ బీ ఫ్లాప్‌ అయింది. ప్లాన్‌ సీ అప్లయ్‌ చేయలేకపోయారు. ఆఖరికి అబ్బులు టీమ్‌ కూడా చేతులెత్తేసింది. అప్పుడే సరికొత్త ప్రణాళికతో ఎంట్రీ ఇచ్చింది బెకెం ఇన్‌ఫ్రా సంస్థ. వాటర్‌ లోడింగ్ విధానంతో ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర ఇరుక్కున్న బోట్ల వెలికితీత పనుల్లో పురోగతి సాధించింది. ఒక బోటును విజయవంతంగా బయటకు తీసింది. మిగతా బోట్లను ఇవాళ వెలికితీస్తామంటున్నారు ఇంజినీర్లు. అసాధ్యం అనుకున్న పని సుసాధ్యం అయింది. ఎనిమిది రోజుల అధికారుల శ్రమకు ఫలితం దక్కింది. ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లకు ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది.

కాగా గత ఎనిమిది రోజులుగా పడవల తొలగింపు ప్రక్రియ అధికారులకు సవాల్‌ గా మారింది. తొలుత ప్లాన్ -ఏ లో భాగంగా 50 టన్నుల బరువును లేపగలిగే సామర్ధ్యం ఉన్న రెండు బాహుబలి క్రేన్లతో ప్రయత్నించినా.. ఆ బోట్లు కదల్లేదు. ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బీని అమలు చేశారు. స్కూబా డైవింగ్ ద్వారా నీటిలోపలికి వెళ్లి పడవలను ముక్కలు చేసి బయటకు తీయాలనుకున్నారు కానీ ఈ ప్లాన్‌ కూడా ఫ్లాప్‌ అయింది.

ఎయిర్ బెలూన్లతో బోట్లను పైకి లేపాలని ప్లాన్‌

ప్లాన్‌ సీలో భాగంగా ఎయిర్ బెలూన్లు పెట్టి బోట్లను పైకి లేపాలని చూశారు అధికారులు. మునిగిన బోట్లు చాలా బరువు ఉండటం, వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో పడవలను తొలగించడానికి కచ్చులూరు బోటు ప్రమాద సమయంలో పని చేసిన అబ్బులు టీమ్‌ను రంగంలోకి దింపారు. ఆ టీమ్‌ బోటుకు రోప్‌ (తాడు)లు వేసి పైకి లాగారు. పడవ కొంతమేర పైకి వచ్చి మళ్లీ మునిగింది. దీంతో తమ ప్రయత్నాలను విరమించుకుంది అబ్బులు టీమ్‌. తాజాగా బోట్లను వెలికితీయడానికి సరికొత్త ప్రణాళికను అమలు చేశారు బెకెం ఇన్‌ఫ్రా సంస్థ ఇంజినీర్లు. వాటర్ లోడింగ్ విధానం ద్వారా అతి కష్టం మీద ఒక పడవను వెలికితీశారు. వాటర్‌ లోడింగ్ విధానంలో భాగంగా రెండు పడవలకు గడ్డర్లు పెట్టి జాయింట్ చేసి చిక్కుకున్న పడవల దగ్గరికి తీసుకుకెళ్లారు ఇంజినీర్లు. వాటిలో నీటిని నింపి లాక్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

తర్వాత చైన్‌లతో మునిగిపోయిన పడవను పైకి లాగారు. 40 టన్నులున్న భారీ బోటు ఇసుక, నీరు చేరికతో బోటు 100 టన్నుల బరువు పెరిగింది. తాడులతో నెమ్మదిగా లాగి సక్సెస్‌ ఫుల్‌గా బయటకు తీశారు. పడవ వెలికతీతలో భాగంగా రెండు భారీ బోట్లకు గడ్డర్లు పెట్టి ఈ ప్రక్రియ చేపట్టారు. రెండింటికి అదనంగా మరో రెండు పడవలతో లాగుతూ చిక్కుకున్న బోటును ఒడ్డుకు చేర్చారు. ఇలా వరుపగా మూడు ప్లాన్‌లు ఫెయిలయ్యాక నాలుగో ప్రయత్నంలో బోటు బయటకు వచ్చింది. ఇంకా బ్యారేజీ దగ్గర మూడు బోట్లు చిక్కుకొని ఉన్నాయి. ఈ బోట్లను కూడా వాటర్ లోడింగ్ విధానంలో బయటకు తెస్తామని చెబుతున్నారు ఇంజినీర్లు. బోట్ల వెలికితీతలో పురోగతి కనిపించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. 8 రోజుల కృషి ఫలించడంతో మిగతా బోటుల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేశారు. వాటర్‌ లోడింగ్ పద్ధతిలో బోటు వెలికితీసిన బెకెం ఇన్‌ఫ్రా మిగతా బోట్లను కూడా తీస్తామని చెబుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.