Viral Video: ఇదోరకం పైత్యం.. యూపీలో శవాన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు! ఎందుకంటే..

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ కోసం యువత పడరాని పాట్లు పడుతున్నారు. జనాల మధ్యలో కుప్పిగంతులు వేయడం, రోడ్లపై పిచ్చి చేష్టలు చేయడం.. వాటిని వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి.. వచ్చిన లైకులు, కామెంట్లు చూసి పొంగిపోవడం. నేటి తరం యువతలో ఇదొక వ్యసనంలా మారింది. వ్యూస్‌, లైకుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు నడి రోడ్డుపై శవంలా పడుకుని తాను చచ్చిపోతే ఎలా..

Viral Video: ఇదోరకం పైత్యం.. యూపీలో శవాన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు! ఎందుకంటే..
Man Posing As Dead Body On Busy Road
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 17, 2024 | 10:42 AM

లక్నో, సెప్టెంబర్‌ 17: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ కోసం యువత పడరాని పాట్లు పడుతున్నారు. జనాల మధ్యలో కుప్పిగంతులు వేయడం, రోడ్లపై పిచ్చి చేష్టలు చేయడం.. వాటిని వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి.. వచ్చిన లైకులు, కామెంట్లు చూసి పొంగిపోవడం. నేటి తరం యువతలో ఇదొక వ్యసనంలా మారింది. వ్యూస్‌, లైకుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు నడి రోడ్డుపై శవంలా పడుకుని తాను చచ్చిపోతే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. చచ్చాక పాడెపై తన అందచందాలు ఏ విధంగా ఉంటాయో వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేయాలని తెగ ఉబలాటపడిపోయాడు. ఇంకేముంది.. రద్దీ రోడ్డుపై బారీకేట్లు పెట్టుకుని మరీ పాడెక్కి రోడ్డుపై శవం మాదిరి పడుకున్నాడు. దీంతో జనాలు గుమి గూడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గమనించిన పోలీసులు సదరు యువకులను అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

యూపీ పోలీసులు నడిరోడ్డుపై పడి ఉన్న ఒక శవాన్ని అరెస్ట్‌ చేశారు. శవమంటే నిజంగా శవం కాదు. సామాజిక మాధ్యమంలో పేరు తెచ్చుకోవడానికి కస్గంజ్‌ జిల్లాలో నడిరోడ్డుపై శవంలా పడుకున్న ముకేశ్‌ కుమార్‌, అతడి స్నేహితులైన కొందరు యువకులను అరెస్ట్‌ చేసి జైల్లో వేశారు. ముకేశ్‌ రకరకాల రీల్స్‌ చేసి తన ఇన్‌స్టాఖాత, ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో పోస్టుచేస్తుండేవాడు. దీనిలో భాగంగా తాజాగా యూపీలోని అమన్‌పూర్ తిరాహా వద్ద కుమార్ రాజ్ కోల్డ్ స్టోరేజీ సమీపంలో రోడ్డుపై ఎర్రటి తివాచీపై, ముక్కులో దూది, మెడలో దండ వేసుకుని అచ్చం శవంలా పడుకోగా.. జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ వీడియోను అలవాటు ప్రకారం సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా పోలీసుల కంటపడింది. కస్గంజ్ పోలీసు సూపరింటెండెంట్ అపర్ణ రజత్ కౌశిక్ నేతృత్వంలోని పోలీసులు వీడియోలోని యువకుడిని గుర్తించి, అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

బిజీగా ఉన్న రహదారిపై కదలకుండా పడుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతోపాటు మృతదేహం మాదిరి మేకప్‌ వేసుకుని రహదారిపై పడుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు బీఎన్‌ఎస్‌ఎస్‌లోని 170, 126, 135 సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ముఖేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి చర్యల ద్వారా సమాజానికి చెడు సందేశాన్ని ఇస్తున్నారని, ఇలాంటి వింత, పిచ్చి మనుషులు ఒకరిని చూపి మరొకరు నేర్చుకుంటున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.